దీపావళి రోజున ఏం చేయాలి?
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అన్ని వయసుల వారు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ వుంటారు. నరకాసురుడి బారి నుంచి విష్ణుమూర్తి విముక్తి కల్పించడంతో, తనని ఆరాధిస్తోన్నవారిని అనుగ్రహించడానికి లక్ష్మీదేవి ఈ రోజున బయలుదేరుతుంది.
ఈ రోజున ఆమె అందరి ఇళ్లను పరిశీలనగా చూస్తూ ముందుకు సాగుతుంటుంది. ఏ ఇల్లు పసుపు తోరణాలతో పవిత్రంగా కనిపిస్తూ ... శుభప్రదంగా అనిపిస్తుందో అక్కడ ఆమె తన లక్ష్మీకళను వుంచి వెళుతుంది. అందువలన అమ్మవారిని ఆహ్వానించడానికి ... మంగళప్రదంగా ఇంటిని అలంకరించి ఆమెను ఆనందపరచడానికి అంతా అరాటపడుతుంటారు.
ఇంకా ఈ రోజున ఏం చేయాలో ... ఏం చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందో తెలియక కొంతమంది సతమతమైపోతుంటారు. దీపావళి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. ఈ స్నానం ఇంటిదగ్గర చేసినా సకల పాపాలను హరించి వేస్తూ, గంగానదిలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నూతన వస్త్రాలు ధరించి .. ఇంటిముందు ముగ్గుపెట్టి .. గడపకి పసుపురాసి .. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి.
పూజా మందిరంలో లక్ష్మీదేవి కూర్చున్న వెండి ప్రతిమను ఏర్పాటు చేసుకుని, పసుపు .. కుంకుమ .. గంధంతో అలంకరించాలి. ఆవునెయ్యితో అయిదు వత్తుల దీపారాధన చెయ్యాలి. అష్టోత్తరంతోను ... సహస్ర నామాలతోను అమ్మవారిని పూజించాలి. పూజకు తెలుపు ... పసుపు ... ఎరుపు వర్ణం గల పూలను ఉపయోగించాలి. ధూప .. దీపాల తరువాత అమ్మవారికి ఇష్టమైన తీపిపదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి.
ఆ సాయంత్రం పూజా మందిరం చెంత .. అన్ని గుమ్మాలకి ఇరువైపులా .. వాకిట్లోను .. తులసికోట చెంత దీపాలను ఉంచాలి. పూర్వం ఇలా దీపాలు వెలిగించి పెద్దగా శబ్దాలు వచ్చేలా చేటలపై కర్రలతో కొడుతూ 'జ్యేష్టాదేవి'ని సాగనంపేవాళ్లు. కాలక్రమంలో టపాకాయలను కాలుస్తూ ఆ శబ్దాలు చేయడం ఆచారంగా మారిపోయింది. అష్టకష్టాలపాలు చేసే జ్యేష్టాదేవిని సాగనంపి, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ఆహ్వానించి .. ఆరాధించి .. ఆమె అనుగ్రహాన్ని పొందడమే దీపావళి పండుగ పరమార్ధమని చెప్పవచ్చు.