మాంగాడు
దక్షిణ భారతదేశంలో వెలసిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో 'మాంగాడు'ఒకటి. చెన్నై నగరానికి నైరుతిగా 20 కిలోమీటర్ల దూరంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో, 'శ్రీ కామాక్షీ దేవి' అమ్మవారు భక్తులపాలిట కల్పవృక్షమై కోరిన కోరికలు నెరవేరుస్తోంది. 'మాంగాడు'అంటే 'మామిడి తోట'అని అర్థం. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రదేశంలోనే పార్వతీదేవి అమ్మవారు సదాశివుడిని భర్తగా పొందేందుకుగాను 'పంచాగ్ని తపస్సు'ను ఆచరించింది.
నాలుగు వైపులా అగ్నులు ఎగసిపడుతుండగా మధ్యలోని అగ్నిహోత్రంపై ఎడమపాదం బొటనవ్రేలుపై నిలిచి, కుడికాలు మడిచి ఎడమకాలుపై ఆనిచ్చి అమ్మవారు నిలుచుని వుంటుంది. ఆ సమయంలో ఆమె ఎడమచేయి హృదయంపైన ... కుడిచేయి తలపైకి నిలిపి వుంటుంది. దీనినే 'పంచాగ్ని తపస్సు' అంటారు. అలా తపస్సు ఆచరిస్తోన్న భంగిమలోనే కామాక్షీ అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది.
ఇక్కడికి సమీపంలోని కాంచీపురంలో వేంచేసిన 'ఏకామ్రేశ్వర స్వామి' ఆమె కఠోర తపస్సుకు మెచ్చి వివాహమాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే వివాహం కావలసిన కన్యలు తమకి ఉత్తముడైన పురుషుడు భర్తగా లభించాలనే ఉద్దేశంతో ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు. తమ అభీష్టం నెరవేరగానే అమ్మవారికి మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు.
శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని, ఈ క్షేత్రంలో 'శ్రీ చక్ర' ప్రతిష్ఠ చేశారు. ఆదిపరాశక్తితో పాటుగా శివకేశవుల ఆలయాలు ఇక్కడ కొలువుదీరి కనిపిస్తాయి. పర్వదినాల్లో జరుగు విశేష పూజలకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు ... అమ్మవారి కృపాకటాక్షాలను పొందుతూ వుంటారు.