గురు పాదుకల మహిమ
శ్రీ అక్కల్ కోట స్వామికి ... శ్రీ శిరిడీ సాయిబాబాకి మధ్య చాలా దగ్గర లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఇద్దరూ కూడా విష్ణుమూర్తిలా ప్రశాంతంగా కనిపిస్తూనే, ఒక్కసారిగా రుద్రుడిలా ఆగ్రహావేశాలను వ్యక్తం చేసేవారు. ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు. ఆ సమయంలో అక్కడున్న వారికి వారిపట్ల గల అభిప్రాయం మారిపోయే పరిస్థితి వచ్చేది. కానీ ఆ సమయంలోనే వాళ్లు అలా వ్యవహరించడానికి గల కారణం తెలిసిపోతూ వుండేది.
శ్రీ అక్కల్ కోట స్వామి ... శ్రీ శిరిడీ సాయిబాబా ఇద్దరూ కూడా గురు పాదాల మహిమను చెప్పకనే చెప్పారనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. వాటిలో ఒక సంఘటన శ్రీ అక్కల్ కోట స్వామి వారి జీవిత చరిత్రలో మనకి కనిపిస్తుంది. శ్రీ అక్కల్ కోట స్వామి ఆరంభంలో తన భక్తుడైన 'చోళప్ప' ఇంట్లో ఉండేవాడు. అక్కడే ఆయనను అంతా దర్శించుకుంటూ వుండేవాళ్లు.
చోళప్ప భక్తిని స్వామి అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉండేవాడు. అది ఎంతటి కష్టతరమైనదే అయినా ... ఇబ్బందికరమైనదే అయినా చోళప్ప నెగ్గుతూ ఉండేవాడు. దాంతో తనపై ఆయనకి గల భక్తిని తెలుసుకుని స్వామి సంతోషంతో మురిసిపోతూ ఉండేవాడు. ఆ కుటుంబానికి అన్ని విధాలా రక్షకుడిగా నిలిచేవాడు. ఓసారి చోళప్ప భార్య యశోబాయికి తేలుకుట్టింది. ఆ బాధను భరించలేక ఆమె విలవిలలాడి పోసాగింది.
జరిగింది తెలుసుకున్న స్వామి, వెంటనే తన పాదుకలను ఆమె దగ్గరికి విసిరాడు. ఒక పాదుకలో ఆమె తేలుకుట్టిన చేతిని ఉంచింది. అంతే ఎలాంటి బాధలేకుండా ఆమెకి చల్లగా .. హాయిగా అనిపించింది. ఏ మాత్రం బాధలేకపోవడంతో ఆశ్చర్యపోతూ చెయ్యి బయటికి తీసింది. అంతే మళ్లీ విపరీతమైన బాధకలగడం మొదలైంది.
తిరిగి పాదుకలో చేయి వుంచగానే బాధ మటుమాయమై పోయింది. అప్పుడామెకి ఆ పాదుకల మహిమ గురించి తెలిసింది. బాధ పూర్తిగా తగ్గిన తరువాతనే ఆమె ఆ పాదుకలో నుంచి చేయి బయటికి తీసింది. విషానికి విరుగుడులా పనిచేసిన పాదుకలను కళ్లకు అద్దుకుని స్వామివారి చెంత వుంచి, కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించింది.