సాలగ్రామ పూజా నియమం
సాలగ్రామాలలో విష్ణు స్వరూపమైనవి ... శివ స్వరూపమైనవి వుంటాయి. ఆయా చిహ్నాల ద్వారా వీటిని గుర్తిస్తూ వుంటారు. పరమ పవిత్రంగా చెప్పబడే ఈ సాలగ్రామాలు చాలా వర్ణాల్లో ... వివిధ పరిమాణాల్లో ... అనేక ఆకారాల్లో కనిపిస్తూ వుంటాయి. గర్భాలయాల్లో మూలమూర్తులతో పాటుగా సాలగ్రామాలు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి.
ఒకప్పుడు వీటి గురించిన అవగాహన లేకపోవడం వలన భక్తులు వీటికి కాస్త దూరంగా వుండేవారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది సాలగ్రామాలను తమ పూజామందిరాల్లో వుంచి పూజాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే కొంతమంది వీటిని ఎలా పూజించాలో తెలియక తికమకకి లోనవుతున్నారు. మరికొందరేమో ... సాధారణ పూజలలో పసుపు - కుంకుమలను ఉపయోగిస్తుంటారు కనుక, సాలగ్రామాలను సైతం వీటితోనే పూజిస్తున్నారు.
అయితే సాలగ్రామాలను పసుపు - కుంకుమలతో పూజించకూడదని శాస్త్రం చెబుతోంది. సాలగ్రామాలను అభిషేకించిన తరువాత, పువ్వులతో మాత్రమే పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోను సాలగ్రామాలను పసుపు - కుంకుమలతో పూజించకూడదనీ, వాటిని సాలగ్రామాలపై చల్లకూడదని అంటోంది.
ఇక విష్ణుమూర్తి .. శివుడు ... పార్వతీదేవి ... గణపతి ... సూర్యుడుని ఆరాధించడాన్ని 'పంచాయతన పూజ' అంటారు. ఈ విధానంలో ఈ దేవతామూర్తులందరినీ సాలగ్రామ శిలా రూపాల్లో పూజించడం జరుగుతుంది. ఈ పూజలో సైతం పసుపు - కుంకుమలను ఉపయోగించ కూడదని శాస్త్రం స్పష్టం చేస్తోంది.