పులిగా వచ్చిన పెద్దమ్మ
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం అనేక మంది అసురులను సంహరించింది. దుర్మార్గుల బారి నుంచి తన బిడ్డలను కాపాడుకోవడం కోసం వివిధ నామాలతో ... రూపాలతో ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో అమ్మవారు 'పెద్దమ్మ' గా తన బిడ్డలతో పిలిపించుకుంటోన్న క్షేత్రం 'జగన్నాథపురం'లో దర్శనమిస్తోంది. ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో అలరారుతోన్న ఈ క్షేత్రం, ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది.
ఇక్కడ అమ్మవారు కొలువైన ప్రదేశానికి ... పూర్వం ఓ పెద్దపులి ప్రతి రోజూ వచ్చేదట. ఇక్కడి చింతచెట్టు కింద ఆ పెద్దపులి సేదతీర్చుకుని వెళుతూ వుండేది. ఆ పెద్దపులి ఎవరినీ ఏమీ అనకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అమ్మవారే ఆ రూపంలో వస్తోందని అంతా అనుకునేవారు.
ఆ తరువాత కొంత కాలానికి ఆ పెద్దపులి రాకపోవడంతో, గ్రామస్తులంతా కలిసి ఆ ప్రదేశంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ వస్తున్నారు. అమ్మవారే తమ బాగోగులను చూసుకుంటుందనే ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన, విజయాలు ... సంపదలు సొంతమవుతాయని చెబుతుంటారు.
గర్భాలయంలో అమ్మవారు శిలపై మలచబడిన రూపంలో దర్శనమిస్తుంది. పసుపుతో అలంకరించబడిన మోముతో, త్రిశూలాన్ని ధరించి కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది. దేవీ నవరాత్రులలో అమ్మవారి అలంకరణ మహోత్సవం చూసితీరవలసిందే. ఇక్కడ జరిగే శ్రీ చక్రార్చన ... చండీ హోమాలు ... రుద్రాభిషేకాలలో భక్తులు విరివిగా పాల్గొంటూ వుంటారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి .. హనుమంతుడు .. నాగదేవత .. నవగ్రహాలు పూజలు అందుకుంటూ వుంటారు.