శ్రీ బోయకొండ గంగమ్మ
చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోన్న పుణ్యక్షేత్రాలలో ... 'శ్రీ బోయకొండ గంగమ్మ' క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో వుంది. స్థల పురాణాన్ని బట్టి పూర్వం ఈ బోయకొండ ... 'దేవరగిరి కొండ' పేరుతో పిలవబడింది. వాల్మీకి మహర్షి ... అగస్త్య మహర్షి ఇక్కడే తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారట.
నవాబుల పరిపాలనా కాలంలో ఇక్కడి బోయలు పన్నులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో తమ శక్తిమేరకు నవాబుల సైన్యంతో పోరాడి, ఆ సైన్యం ధాటికి తట్టుకోలేక తమని కాపాడమంటూ అమ్మవారిని ప్రార్ధించారట. అంతే ఆగ్రహావేశాలకులోనైన అమ్మవారు నవాబు సైన్యాన్ని సంహరించింది. వారితో అమ్మవారు పోరాడిన ఆనవాళ్లు నేటికీ ఇక్కడ చూడవచ్చు. ఎప్పటికీ తమకి అండగా ఉండమన్న బోయల అభ్యర్ధనమేరకు అమ్మవారు అక్కడే గంగమ్మ పేరున అవతరించింది. ఆ రోజు నుంచి ఇక్కడి అమ్మవారిని బోయకొండ గంగమ్మ అని పిలుస్తుంటారు.
అమ్మవారు అవతరించిన రోజును పురస్కరించుకుని ఇక్కడ పెద్దఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సంతానాన్ని కోరుకునేవారు పుష్కరిణిలో స్నానమాచరించి ఈ అమ్మవారిని దర్శిస్తూ వుంటారు. ఇక తమ కోరికలు నెరవేరినవారు తలనీలాలు సమర్పిస్తూ వుంటారు. అమ్మవారి అనుగ్రహం గురించి భక్తులకు ప్రత్యక్ష అనుభవాలు వున్న కారణంగా, నిత్యం వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించి పునీతులవుతుంటారు.