వరదరాజస్వామి మహిమ
మువ్వ గోపాలస్వామి పదాలు పాడుతూ వరదయ్య అనేక పుణ్య క్షేత్రాలను దర్శించసాగాడు. ఈ ప్రయాణంలో ఆయనకి ఎన్నో అనుభవాలు ... మరెన్నో అనుభూతులు ఎదురవుతూ రాసాగాయి. ఆయన పాడుతూ వెళుతోన్న మువ్వగోపాల పదాలను, ఆయా ప్రాంతాలకి చెందిన వారు సైతం పాడుకోవడం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే వరదయ్య కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి చేరుకున్నాడు. వరదరాజస్వామి సౌందర్యం ఆయన కళ్లను కట్టిపడేసింది. ఆ స్వామి రూపాన్ని మనసులో ముద్రించుకుంటూ వరదయ్య ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఆయనని గమనించని అర్చకులు ఆలయానికి తలుపులు వేసుకుని వెళ్లిపోయారు. ఆ రాత్రంతా ఆయన ఆలయంలోనే ఉండిపోయాడు.
ఉదయాన్నే తలుపులు తీయడానికి వచ్చిన అర్చకులు లోపల నుంచి పాటలు వినిపిస్తూ వుండటంతో కంగారుపడిపోయారు. ఆలయంలో రాత్రంతా వున్న వరదయ్యను అనుమానంగా చూశారు. స్వామివారిపై ఆయన పాడిన శృంగార పరమైన పదాల పట్ల వాళ్లు అభ్యంతరాన్ని తెలియజేశారు. స్వామివారు ... అమ్మవారు తనని కటాక్షించారనీ, ఆ దంపతుల అనురాగాన్ని ప్రత్యక్షంగా చూస్తూ తాను పాడానని చెప్పాడు వరదయ్య.
ఆ మాటలు నమ్మని అర్చకులు వరదయ్యను దండించడానికి ప్రయత్నించారు. ఆయన చెబుతున్నది నిజమేనన్నట్టుగా ఆలయంలో గంటలు వాటంతటవే మోగడం మొదలుపెట్టాయి. అమ్మవారు ... అయ్యవారు అక్కడ తిరుగాడినట్టుగా వారి పాద ముద్రలు కనిపించాయి. అంతే అర్చకులు ఆశ్చర్యపోయారు ... వరదయ్య మాటలను నమ్మారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి వరదయ్యకి మర్యాదలు చేశారు.
వరదయ్య భక్తి ప్రపత్తులను అర్చకులు ప్రశంసించారు. అప్పటికే వరదయ్య అనేక క్షేత్రాలను దర్శించాడనీ, మిగతా క్షేత్రాలను చూడటమే ఆయన లక్ష్యమని తెలుసుకున్న అర్చకులు, ఆయనని క్షేత్రయ్య అని పిలవడం ప్రారంభించారు. అలా వరదయ్య కాస్తా క్షేత్రయ్యగా మారిపోయాడు ... భక్తి భావాల వనంలో పదాల పరిమళాలను వెదజల్లాడు.