పానకం తాగే మంగళగిరి దేవుడు
విజయవాడకు సమీపంగా వున్న మంగళగిరిలో 'శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి' వెలిశాడు. కొండపై వెలసిన స్వామి కొంగుబంగారమై, కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇక్కడి గాలిగోపురం చుక్కలను తాకుతున్నట్టుగా కనిపిస్తూ వుంటుంది. ఈ గోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడు. లక్ష్మీ సమేతంగా స్వామివారు వెలసిన ఈ కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తూ వుంటుంది.
పూర్వం పశువులను మేపడానికి ఈ కొండపైకి వెళ్లిన కాపరి, ఛాయా మాత్రంగా కనిపిస్తోన్న ఓ చిత్రమైన ఆకారానికి తన ఆవు పాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఆకారం ఓ బిలంలోకి వెళ్లి మాయం కావడం చూసి ఆలోచనలో పడ్డాడు. ఆ రాత్రి అతనికి నరసింహస్వామి కలలో కనిపించి, ఓ రాక్షసుడిని సంహరించడానికి తాను అక్కడ వెలసినట్టుగా చెప్పాడు.
దాంతో మర్నాడు ఉదయమే ఆ పశువుల కాపరి తన బంధుమిత్రులను తీసుకుని ఆ బిలం దగ్గరికి వెళ్లి, భక్తి భావంతో అందులో చిక్కనిపాలు పోశాడు. అయితే సగం మాత్రమే లోపలివెళ్లి సగం బయటికి వచ్చేశాయి. దానినే వాళ్లంతా తీర్థంగా స్వీకరించారు. స్వామి కృతయుగం నుంచి ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలో అమృతాన్ని ... ద్వాపర యుగంలో పాలను సేవించిన స్వామి, కలియుగంలో పానకాన్ని స్వీకరిస్తూ 'పానకాల నరసింహ స్వామి'గా పూజలందుకుంటూ వున్నాడు.
ఇక ఇక్కడి స్వామివారిని మధ్యాహ్నం సమయంలో దేవతలు పూజిస్తారని స్థల పురాణం చెబుతోంది. కాబట్టి ఆ సమయంలో కొండపై ఎవరూ ఉండకుండా కిందికి వచ్చేస్తారు. దుష్ట గ్రహాలతో పీడించబడే వారు ... ఆయురారోగ్యాలను ... సకల సంపదలను కోరుకునే వారు స్వామివారిని ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.