నీలకంఠ స్వామి
శివుడు ... గరళ కంఠుడు ... విష ప్రభావం కారణంగా ఉద్భవించే వేడిని తట్టుకోవడం కోసం ఆయన ఇటు గంగను ... అటు చంద్రుడిని తలపై పెట్టుకున్నాడు. గంగను ధరించి గంగాధరుడు ... చంద్రుడిని ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు. అలాంటి ముక్కంటి సన్నిధిలో గంగమ్మ కనిపించే పుణ్య క్షేత్రమే ... 'శ్రీ నీలకంఠస్వామి క్షేత్రం'. కోరిన వరాలను ప్రసాదించే ఈ క్షేత్రం ... శ్రీకాకుళం జిల్లా 'పాతపట్నం' లో విరాజిల్లుతోంది.
ఇక ఇక్కడ ఈ క్షేత్రం ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. 17 వ శతాబ్దంలో ఈ ప్రాంతం 'పర్లాకిమిడి'కి చెందిన 'ముకుంద గజపతి నారాయణ' ఏలుబడిలో వుండేది. పాతపట్నంలోని నదీ తీరంలో ఓ రైతు భూమిని దున్నుతూ వుండగా, శివలింగం బయటపడింది. ఈ విషయం ఊరు పెద్దలతో చెప్పడానికి అతను ఊళ్లోకి బయలుదేరాడు. అంతకు ముందు రోజు రాత్రే ముకుంద గజపతి నారాయణకి శివుడు కలలో కనిపించి తాను ఫలానా చోటున ఉన్నట్టుగా చెప్పి, ఆలయాన్ని కట్టించమంటూ అదృశ్యమయ్యాడట.
దాంతో ఆయన పాతపట్నం వస్తూనే రైతు ద్వారా విషయం తెలుసుకుని వెంటనే వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ శివలింగానికి దేవాలయాన్ని నిర్మించి 'నీలకంఠ స్వామి'గా కొలవసాగారు. ఇక ఇక్కడి ఆలయంలో స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకోవాలంటే జనవరి నుంచి జులై మధ్యలో మాత్రమే అనుకూలంగా వుంటుంది. ఆ తరువాత ఆరు నెలలపాటు గర్భాలయంలోని శివలింగం నీటిలోనే వుంటుంది.
గర్భాలయంలో నీరు దానంతట అదే ఊరుతూ వుంటుంది. ఇలా ఉబికి వస్తోన్న నీటినే ఇక్కడ తీర్థంగా ఇస్తూ వుంటారు. ఆరు నెలలు గడిచాక గర్భాలయంలో నీరంతా మాయమైపోతుంది. అంతకు ముందు నీరు ఉబికి వచ్చిన ఆనవాళ్లు కూడా అక్కడ కనిపించవు. ఈ జల విశేషాన్ని చూడటానికి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక గజపతి రాజులు చేయించిన పంచలోహ విగ్రహానికే ఇక్కడ ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతూ వుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ... గజపతుల కాలంనాటి శిల్పకళా వైభవంతో అలరారుతోన్న ఈ దేవాలయ దర్శనం మనసుకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.