నందలూరు
శ్రీవేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటిగా 'నందలూరు' వెలుగొందుతోంది. కడప జిల్లాకి చెందిన ఈ క్షేత్రం 11 వ శతాబ్దం నుంచి అలరారుతున్నట్టు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీనివాసుడు కటి హస్తంతో దర్శనమిస్తే, ఇక్కడి స్వామి అభయ హస్తంతో కనిపిస్తాడు. ఈ తేడా మినహా ఈ రెండు ధృవమూర్తులు ఒకేలా అనిపిస్తుంటాయి.
ఇక్కడి స్వామి మూలమూర్తి ప్రశాంతత ఉట్టిపడుతూ మనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. ఈ కారణంగానే భక్తులు స్వామివారిని 'సౌమ్యనాథుడు' అనే పేరుతో కొలుస్తుంటారు. నారద మహర్షి ప్రతిష్ఠించినట్టుగా చెబుతోన్న స్వామి ప్రతిమ, చోళరాజుల కాలంలో వెలుగు చూసింది. దాంతో ఆ రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించి, తరతరాలపాటు స్వామి సేవకు ఎలాంటి లోటు రాకుండా మాన్యాలు రాసిచ్చారు. ఆ తరువాత వచ్చిన రాజులు సైతం ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేశారు.
ఎంతోమంది రాజులు స్వామివారికి అత్యంత ఖరీదైన కానుకలను సమర్పించినట్టు తెలుస్తోంది. ఆలయ వైశాల్యం ... ప్రాకారాలు ... గోపుర నిర్మాణం చూస్తే, ఆనాటి రాజుల భక్తి శ్రద్ధలు అర్ధమవుతాయి. తాళ్లపాక అన్నమాచార్యులు తరచూ ఇక్కడి స్వామిని దర్శించినట్టు ఆధారాలు వున్నాయి.
ఆపదలో ఆదుకోవడంలో ఇక్కడి స్వామి తిరుమల వెంకన్నను తలపిస్తాడని భక్తులు చెబుతుంటారు. పర్వదినాల సమయంలోను ... బ్రహ్మోత్సవాల సమయంలోను భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు. ఆ స్వామి సేవలో పాల్గొంటూ పునీతులవుతుంటారు.