శ్రీ బేడీ ఆంజనేయస్వామి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు ముందుగా 'శ్రీ బేడీ ఆంజనేయస్వామి'వారి ఆలయం కనిపిస్తుంది. కాళ్లకు ... చేతులకు బేడీలు తలించబడి వుండటం వలన ఇక్కడి ఆంజనేయుడిని ... బేడీ ఆంజనేయుడని అంటూ వుంటారు.
తిరుమల కొండలపై హనుమంతుడి తల్లి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ వుండేది. ఆ సమయంలో ఆంజనేయుడు నానాఅల్లరి చేస్తూ ఉండటంతో, అంజనాదేవి ఆయన కాళ్లకు ... చేతులకు బేడీలు వేసి వేంకటేశ్వరస్వామి ఎదుట నిలబెట్టిందని అంటారు. ఇక ఇలా హనుమంతుడి ప్రతిమను నిలపడం మహంతుల సంప్రదాయమని మరికొందరు చెబుతుంటారు.
ఏదేవైనా కాళ్లకు ... చేతులకు బేడీలు తగిలించడంతో, ఏం చేయాలో పాలుపోనట్టుగా ఆంజనేయుడు అమాయకంగా కనిపిస్తుంటాడు. బుద్ధిగా ... ముద్దుగా వున్న ఆంజనేయుడిని చూడగానే మనసుకు ఏదో తెలియని మహదానందం కలుగుతుంది. బేడీ ఆంజనేయస్వామికి ఆకలి ఎక్కువని అంటారు. ఆయనకి సంబంధించిన నైవేద్యాలు మూడుపూటలా శ్రీవారి ఆలయం నుంచే వస్తుంటాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో, స్వామివారికి బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచే పట్టువస్త్రాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. ఇక ప్రతినెలా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన 'పునర్వసు' నక్షత్రం రోజున సీతారాములు ఊరేగింపుగా ఇక్కడికి వస్తారు. సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయస్వామి కూడా హారతి అందుకుని, రాములవారి మెడలోని పుష్ప హారాన్ని కానుకగా స్వీకరిస్తాడు.
ఈ వేడుక చూడటానికి ఎంతో సరదాగా ... సంతోషంగా వుంటుంది. సీతారాములకు ... ఆంజనేయస్వామికి గల అనుబంధం కళ్ల ముంగిట కమనీయ దృశ్య కావ్యమై కదలాడుతుంటుంది.