దేవుడి ప్రతిమ దొరికితే ?
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానం ఎంతో విశిష్టమైనది. దైవాన్ని ఆరాధించడం ... ఆ దైవం ఆశీస్సులతో దైనందిన కార్యక్రమాలను ఆరంభించడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. మతాల ప్రస్తావన పక్కన పెడితే ఇక్కడ దైవాన్ని విశ్వసించని వాళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అందరినీ నడిపించేది ఆ దేవుడేనని నమ్మేవాళ్లు మాత్రం ఆయనకి నమస్కరించకుండా ఉండలేరు.
దేవుడికి సంబంధించిన ప్రతి వస్తువును ఇక్కడి వాళ్లు ఎంతో అపురూపంగా చూస్తుంటారు ... భద్రంగా దాస్తుంటారు. ఇక దేవుడి ప్రతిమల విషయంలోనూ అంతా భయభక్తులను కలిగివుంటారు. ఎక్కడైనా ఒక చిన్న దేవుడి విగ్రహం బయట పడిందంటే, వెంటనే దానికి పందిరి ఏర్పాటు చేసి పూజాభిషేకాలు జరిపిస్తుంటారు.
ఇంటికి సంబంధించిన నిర్మాణపు పనులు గానీ, మరే ఇతర నిర్మాణాలు గాని జరుగుతున్నప్పుడు ఒక్కోసారి దేవుడి ప్రతిమలు బయటపడుతూ వుంటాయి. గతంలో ఆ విగ్రహాలు అక్కడ ఉండటానికీ, అవి కాలగర్భంలో కలిసిపోవడానికి ఎన్నో కారణాలు వుంటాయి. అయితే ఎవరూ కూడా ఆ విషయాలను గురించి పెద్దగా ఆలోచించరు. ఆ విగ్రహాలను పూజించమని కొందరు ... వద్దని కొందరు చెబుతుంటారు. మరి కొందరు వాటికి ఆలయాన్ని నిర్మించమని సలహా ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఆ స్థలం సొంతదారులు, బయటపడిన విగ్రహాలను ఏం చేయాలో తెలియక సతమతమై పోతుంటారు. ఏం చేయడంవల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందోనని ఆందోళన చెందుతూ వుంటారు. అయితే శాస్త్రం మాత్రం ఇందుకు స్పష్టమైన సమాధానం చెబుతోంది. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను ఆ ప్రాంతానికి చెందిన ఆలయంలో ఇవ్వడం మంచిదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఆ విగ్రహాలు భిన్నమై (దెబ్బతిని) వుంటే, నీటి ప్రవాహాల్లో నిమజ్జనం చేయమని సూచిస్తోంది. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషాలు ఉండవని కూడా చెబుతోంది.