మార్కండేశ్వర స్వామి
మృకండ మహర్షి నివసించిన ప్రదేశం 'మార్కండేయపురం' గా పిలవబడుతుండగా, ఆయన ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం ... 'మార్కండేశ్వర స్వామి'గా పూజలందుకుంటోంది. భక్తితో మొక్కినంతనే ముక్తిని ప్రసాదించే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి కారణమైన కథ ఒకటి స్థల పురాణంగా మనకి ఇక్కడ వినిపిస్తుంది.
పూర్వం ఇక్కడి గోదావరి సమీపంలో కుటీరాన్ని నిర్మించుకుని మృకండ మహర్షి దంపతులు నివసించేవారట. పుత్ర సంతానం కోసం మృకండ మహర్షి తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తి శూన్యుడైన పూర్ణ ఆయుష్షుగల పుత్రుడు కావాలో ... శివభక్తి గలిగిన అల్పాయుష్కుడు కావాలో కోరుకోమని శివుడు అడగడంతో, శివ భక్తుడే కావాలని మృకండ మహర్షి కోరుకున్నాడు. శివుడు అనుగ్రహంతో జన్మించిన ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణ చేశారు.
సాక్షాత్తు మార్కండేయుడు పూజించిన శివలింగం మనకి ఈ క్షేత్రంలో దర్శనమిస్తుంది. మార్కండేయుడు ఆశువుగా 'చంద్రశేఖర అష్టకం' చెప్పినది ఈ శివలింగం దగ్గరేనని అంటారు. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ క్షేత్రం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకోగా ... నూజివీడు జమీందారు పునఃనిర్మించాడు. తన తదనంతరం దేవుడికి నిత్య నైవేద్యాల జరుగుబాటుకి గాను మాన్యాలు రాసిచ్చాడు.
లింగరూపంలో మార్కండేశ్వర స్వామి దర్శనమిస్తుండగా, పానవట్టం పై ఓ వైపున ఉమాదేవి ప్రతిమ కనిపిస్తుంది. ఏక రాతిలో అమ్మవారి ప్రతిమ కూడా మలచబడి వుండటం ఎంతో విశేషమని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. గర్భాలయానికి ఎదురుగా వున్న నందీశ్వరుడు, ప్రభు భక్తికి ... ప్రాచీనతకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాడు. కార్తీక మాసంలో 3 రోజుల పాటు స్వామివారిపై సూర్యకిరణాలు పడటాన్ని ఆయన లీలా విశేషంగా భావిస్తూ వుంటారు. ఇక్కడి స్వామివారికి ప్రతి ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక ప్రతి పౌర్ణమి రోజున జరిగే గ్రామోత్సవంలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు.