ద్వారానికి దేవుడి పటాలు
దైవారాధనను విశ్వసించే ప్రతి ఇంట్లోను పూజగది గానీ, పూజా మందిరం గాని తప్పకుండా కనిపిస్తుంటాయి. పూజా మందిరంలో వారికి ఇష్టమైన దేవుడి ప్రతిమలు ... చిత్ర పటాలు వుంచి నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. దైవభక్తి ఎక్కువగా గల భక్తుల ఇళ్లలో అడుగు పెడుతూనే, వారి ఇష్టదైవమెవరో వెంటనే చెప్పేయవచ్చు. ఎందుకంటే ఆయా ఇష్ట దైవాల పటాలు వారు ద్వారానికి పైన ఉంచుతుంటారు.
పూర్వం చెక్కతో చేయబడిన ద్వార బంధాలను వివిధ దైవ ప్రతిమలతో మలిచేవారు. ఈ ద్వార బంధాల్లో ఎక్కువగా గణపతి ... లక్ష్మీదేవి ప్రతిమలు ఉండేవి. కాలక్రమంలో ఈ విధానానికి ప్రాధాన్యత తగ్గడంతో, ఇష్ట దైవాల చిత్ర పటాలను గుమ్మానికి పైన అమర్చడం జరుగుతోంది. అయితే ఈ విధానంలోను భక్తులలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇంటికి వచ్చిన వారు ఎవరైనా గుమ్మానికి పైన వేంకటేశ్వరస్వామి ఉండకూడదని చెప్పినా, లక్ష్మీ దేవిని ద్వారం చెంత వుంచకూడదని అన్నా ఇక వాళ్లు ఆలోచనలో పడిపోతారు. అంతవరకూ ఏదో తప్పుచేసినట్టుగా బాధపడిపోతారు. ఇంకొందరు అవతలవాళ్లు చెప్పిన మాటలు వినాలో .. లేదో తేల్చుకోలేక సతమతమైపోతుంటారు. అయితే శాస్త్రంలో ఇందుకు సరైన సమాధానం కనిపిస్తుంది.
ఇష్టదైవాల చిత్రపటాలను ద్వారం పై అమర్చుకోవచ్చునని అంటోంది. ఈ విధంగా చేయడం వలన ఆయా దేవతల అనుగ్రహం తప్పక ఉంటుందనీ, శుభాలు చేకూరతాయని చెబుతోంది. ఇక హనుమ సమేత సీతారామలక్ష్మణుల చిత్రం పటం ద్వారం పై వుండటం మరింత మంచిదని అంటోంది.
ఈ చిత్ర పటం కిందుగా అటూ ఇటూ తిరుగుతూ వుంటాం కనుక, సమస్త దోషాలు తొలగి సకల శుభాలు చేకూరతాయని స్పష్టం చేస్తోంది. కనుక ద్వారానికి పైన అటు .. ఇటు ఇతర దేవతల చిత్ర పటాలు వుంచి, ద్వారం మధ్య భాగంలో సీతారాముల చిత్ర పటం ఉండేలా చూసుకోవడం అన్ని విధాలా అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తోందని తెలుస్తోంది.