నెట్టికంటి హనుమంతుడు
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి ముందు అవతారమే శ్రీ వ్యాసరాయలవారు. ఆయన ప్రతిష్ఠించిన దైవమే 'శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి'. మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లాలోని 'నెట్టికల్లు'లో అలరారుతోంది. క్రీ.శ.1521లో శ్రీ వ్యాసరాయల వారు కర్ణాటక - హంపీ తుంగభద్ర నదీతీర ప్రాంతంలో ధ్యానం చేసుకుంటూ వుండేవారట. ప్రతిరోజు ఆయన తాను ధరించే గంధంతో ఓ రాతిపై హనుమంతుడి రూపాన్ని గీసేవారు. అయితే ఆయన ఆ రూపాన్ని గీసిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపాన్ని పొంది అక్కడి నించి వెళ్లి పోయేవాడు.
దాంతో హనుమంతుని శక్తి మరో చోటికి వెళ్లకుండా వ్యాసరాయల వారు కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అలాంటి సమయంలో ఆయన కలలోకి హనుమంతుడు వచ్చి ... తాను ఫలానా చోట వున్నట్లు చెప్పి తనకి గుడి కట్టించి ఇవ్వవలసినదిగా కోరాడు. ఆ మేరకు హనుమంతుడు చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్లి హనుమంతుడి విగ్రహాన్ని కనుక్కుని దానిని వ్యాసరాయలవారు ప్రతిష్ఠించారు.
ఇక ఈ ప్రాంతం 'కసాపురం' గ్రామానికి దగ్గరగా వుండటం వలన ఇక్కడి స్వామిని కసాపురం ఆంజనేయ స్వామి అనీ ... స్వామి వారి విగ్రహం బయటపడినది 'నెట్టికల్లు'లో కాబట్టి నెట్టికంటి ఆంజనేయస్వామి అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి స్వామి మహాశక్తి సంపన్నుడనీ, భక్తుల సమస్యలకు పరిష్కారమార్గాలను కలలోనే సూచిస్తాడని విశ్వసిస్తూ వుంటారు. ఇచ్ఛా పూర్వకంగా స్వామివారు ఆవిర్భవించిన ఈ పుణ్య క్షేత్రాన్ని భక్తులు విశేష సంఖ్యలో దర్శిస్తూ వుంటారు.