స్వామి ప్రతిభకు పరీక్ష!
ఒకసారి వేంకటనాథుడు (శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వనామం) తన గురువుగారైన సుధీంద్ర తీర్థుల వారితో కలిసి తంజావూరు మహారాజావారి ఆస్థానాన్ని దర్శించారు. అప్పటికే వేంకట నాథుడికి 'పరిమళాచార్య' అనే బిరుదు వచ్చింది. ఆయన ప్రతిభా పాటవాల గురించి తెలుసుకున్న అక్కడి ఆస్థాన పండితులు తమతో వాదన చేయవలసిందిగా పట్టుబట్టారు. వారి అహంకారానికి తగిన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో స్వామి అందుకు సిద్ధపడ్డారు. వాదనలో ఆస్థాన పండితులను ఓడించి, వారి ప్రశంసలను అందుకున్నారు.
వేంకటనాథుడికి 'సకలకళా విశారద'గా బిరుదును ఇచ్చి మహారాజు సత్కరించబోతుండగా, ఆస్థాన నర్తకి 'అపరాజిత' వచ్చి అడ్డుకుంటుంది. సంగీతంలోను ... నాట్యంలోను తనకి గల ప్రావీణ్యం గురించి ప్రస్తావిస్తుంది. తాను 'ముద్ర' కట్టలేని పదాలను ప్రయోగిస్తూ వేంకటనాథుడు పాట పాడాలంటూ సవాలు విసురుతుంది. ఈ పోటీలో విజయం సాధిస్తేనే ఆయన ఆ బిరుదుకి తగిన అర్హత పొందుతాడని అంది. దాంతో ఆమెతో పోటీకి సిద్ధపడతాడు వేంకటనాథుడు.
ఆయన పాట ... ఆమె నాట్యం పోటాపోటీగా సాగుతుంటాయి. ఆస్థానంలోని వారంతా ఆసక్తిగా ... ఆశ్చర్యంగా తిలకిస్తుంటారు. అపరాజిత ముద్రకట్టలేని పదాలను ప్రయోగించి ఆమెను ఓడిస్తాడు వేంకటనాథుడు. తన అహంకారాన్ని మన్నించమంటూ ఆమె ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. అసమానమైన ఆయన ప్రతిభను మహారాజు అభినందిస్తూ సత్కరిస్తాడు. ఆ రోజు నుంచి ఆయన 'సకలకళా విశారద' గా కొనసాగారు.