అద్దంకి
'అద్దంకి' పేరు వినగానే రెడ్డి రాజుల కాలం కళ్లెదుట కదలాడుతుంది. ప్రోలయ వేమారెడ్డి పరిపాలనా కాలంలో అద్దంకి వైభవం, కవి .. పండిత .. నర్తక ... గాయకులకు లభించిన ప్రోత్సాహం గుర్తుకు వస్తుంది. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఎర్రాప్రగడ, ప్రోలయ వేమారెడ్డి ఆస్థానానికి చెందినవారే అనే విషయం అద్దంకి ఘనతకి అద్దం పడుతోంది. సంగీత సాహిత్యాలతో ... శిల్పకళా సంపదతో అలరారిన అద్దంకి ప్రకాశం జిల్లాలో వుంది.
అశేష భక్త జనకోటిని అనుగ్రహించడం కోసం శ్రీ రామలింగేశ్వరుడు ఇక్కడి గుండ్లకమ్మ నదీ తీరంలో ఆవిర్భవించాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి స్వామికి 'రామలింగేశ్వరుడు' అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. అగస్త్య మహర్షి కూడా ఈ రామలింగేశ్వరుడుని దర్శించుకున్నాడని అంటారు. రెడ్డి రాజుల సేవలను అందుకున్న ఈ క్షేత్రం, విజయనగర రాజుల కాలంలో మరింత ప్రసిద్ధి చెందింది.
ప్రాచీనమైనటు వంటి నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వరుడితో పాటు, అమ్మవారు ... వీరభద్రుడు ... వినాయకుడు ... ఆంజనేయుడు కొలువుదీరి కనిపిస్తారు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. రామలింగేశ్వరుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆయనకి జరిగే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.