వేశ్య కళ్లు తెరిపించిన తుకారాం
తుకారాం ... పాండురంగడిపై అభంగాలు రాయడం, వాటిని పాడుతూ వీధుల్లో తిరగడం చేయసాగాడు. తనని తాను మరిచిపోయి ఆయన పాడుతూ వుంటే గ్రామస్తులంతా ఆయనని అనుసరించసాగారు. తుకారాం వున్న గ్రామంలో తాము నివసిస్తూ వుండటం అదృష్టమని వాళ్లంతా భావించేవాళ్లు.
తుకారాం రాసిన అభంగాలు చెవిన పడటంతో, ఆయన గొప్పతనం గురించి శివాజీ మహారాజుకి తెలిసింది. దాంతో ఖరీదైన కానుకలను అతనికి అందజేయమని చెప్పి తన అధికారులను పంపించాడు. తుకారాం వాటిని స్వీకరించకపోవడంతో ఆయన కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగాయి. కపట భక్తుడైన ముంభాజీ ఇది సహించలేకపోయాడు. తుకారాం పరువు ప్రతిష్ఠలను దెబ్బతీయడానికి పన్నాగం పన్నాడు.
ఇందుకోసం తనతో సంబంధాన్ని కలిగి వున్న బహెనా బాయి అనే వేశ్యను పావుగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తుకారాంని ముగ్గులోకి లాగడం ఆమె వలన కాదంటూ రెచ్చగొట్టాడు. తన వంటి అందగత్తెకి అదేమంత కష్టం కాదని ఆమె ఆయనతో పందెం కాసింది. మరునాడు ఉదయం తుకారాంని కలిసి తాను కూడా పాండురంగడి భక్తురాలినని చెప్పింది. తాను చేసుకుంటున్న పాండురంగడి పూజకు రావాలని ఆహ్వానించింది.
ఆమె మాటలు నమ్మివెళ్లిన తుకారాం దగ్గర తన అందచందాలను ఆవిష్కరించడానికి ప్రయత్నించింది. అందచందాలు అశాశ్వితమనీ ... పాండురంగడి అనుగ్రహమే శాశ్వితమని చెప్పి ఆమె కళ్ళు తెరిపించాడు తుకారాం. ఈ లోగా తుకారాం పరువుతీయాలనే ఉద్దేశంతో, గ్రామస్తులందరినీ అక్కడికి వెంటబెట్టుకు వచ్చాడు ముంభాజీ.
అయితే తన వృత్తిని మానుకుని సన్యాసినిగా మారిన ఆమెను చూసి నివ్వెరపోయాడు. తుకారాం మహా భక్తుడనీ ... ఆయనకి మచ్చ తీసుకు రావడానికి ప్రయత్నించడం మహా పాపమని ముంభాజీతో చెప్పింది బహెనా బాయి. విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు ముంభాజీకి చీవాట్లు పెట్టారు. ఆయనవెంట వచ్చినందుకు మన్నించమంటూ తుకారాం పాదాలపై పడ్డారు.