మోక్ష మార్గం
యుగాలకు కాలపరిమితులను విధించిన బ్రహ్మదేవుడు, ఆయా యుగాలకు కొన్ని లక్షణాలను కూడా కల్పించాడు. ఈ కారణంగానే యుగాలతో పాటు మానవుల జీవన విధానం కూడా మారుతూ వస్తోంది. ఆధ్యాత్మిక విషయాల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. దైవాన్ని మానవులు ఆరాధిస్తూ రావడమనేది ప్రతి యుగంలోనూ వుంది.
కష్టనష్టాలతో సతమతమైపోయిన మానవులు, వాటి నుంచి బయటపడటానికి దేవుడినే ఆశ్రయించారు. తమ ఆవేదనను ఆయనకి వినిపించడానికి, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఒక్కో యుగంలో మానవులు ఒక్కో సాధనా మార్గాన్ని ఎంచుకున్నారు. అలా 'కృతయుగం'లో భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించడానికి సాధనా మార్గంగా 'తపస్సు'కనిపిస్తుంది. ఈ యుగంలో దైవ సాక్షాత్కారం కోసం తపస్సులు విరివిగా చేశారు. తమకి కావలసిన వరాలను అదే స్థాయిలో పొందారు.
ఇక 'త్రేతాయుగం' లోకి వచ్చే సరికి భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలను పొందడానికి సాధనా మార్గంగా 'యజ్ఞం' కనిపిస్తుంది. ఈ యుగంలో మానవులు యజ్ఞ యాగాల ద్వారానే దైవాన్ని ప్రసన్నం చేసుకుని, ఆయన ద్వారా తమకి కావలసినవి పొందారు. 'ద్వాపరయుగం' లోకి వచ్చే సరికి 'దానం' ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. దానధర్మాలు విరివిగా చేసినవారినే భగవంతుడు అనుగ్రహించాడు.
వందలసార్లు తపస్సులు ... యజ్ఞాలు చేయడం వలన కలిగే ఫలితం, ఒక్కసారి దానం చేయడం వలన కలుగుతుందని పురాణాలు చెప్పడంతో మానవులంతా ఇదే మార్గాన్ని అనుసరించారు. ఇక కలియుగానికి వచ్చే సరికి, యుగ ధర్మాన్ని బట్టి దైవనామ 'స్మరణం' మాత్రమే చెప్పబడింది. భగవంతుడిని స్మరించుకోవడం వల్లనే సమస్త పుణ్య ఫలాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. నీతి బద్ధమైన మార్గంలో పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ, దైవనామ స్మరణ చేసిన వారికి భగవంతుడి అనుగ్రహం సత్వరంగా లభిస్తుందని చెప్పబడింది.
కాబట్టి ఈ యుగంలో మానవులు తమ విజ్ఞతని బట్టి ఏదైతే కావాలని భగవంతుడి నామాన్ని స్మరిస్తారో అవి తప్పకుండా వారికి దక్కుతాయి. ఎంతోమంది మహాభక్తులు దైవనామ స్మరణతో తరిస్తూ మోక్షాన్ని పొందిన తీరు ఇందుకు ఉదాహరణగా మనకి కనిపిస్తూ వుంటుంది.