జాబాలీ తీర్థ మహిమ
తిరుమల కొండలు అత్యంత పవిత్రమైనవి ... మహా మహిమాన్వితమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామ శిలామాయమైన ఈ కొండలను దర్శించడం వల్లనే సమస్తపాపాలు నశిస్తాయని అంటారు. అలాంటిది ఆ భగవంతుడు ఈ కొండలపై సృష్టించిన తీర్థాలలో స్నానమాచరించడం వలన కలిగే ఫలితం గురించి చెప్పేదేముంటుంది? తిరుమల కొండలను మరింత పవిత్రం చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులను పునీతం చేస్తున్న తీర్థాలలో 'జాబాలీ తీర్థం' ఒకటి.
పూర్వం జాబాలీ మహర్షి ఈ తీర్థం దగ్గర ఆశ్రమం ఏర్పాటుచేసుకుని స్వామి గురించి తపస్సు చేసేవాడు. ఆయన స్పర్శ కారణంగా మరింత శక్తిమంతమైన ఈ తీర్థం ఆయన పేరుతోనే ప్రసిద్ధి చెందింది. నేటికీ తన స్పర్శతోనే భక్తులకు సకల పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఇక ఈ తీర్థ విశిష్టతను చాటిచెప్పే కథ ఒకటి మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు అనేక గ్రహ దోషాల కారణంగా ఒక బ్రాహ్మణుడు నానా ఇబ్బందులు పడసాగాడు. నడి సముద్రంలో సుడిగుండం పాలిట పడ్డట్టుగా ఆయన పరిస్థితి తయారైంది.
ఇక పుణ్య క్షేత్రాలను దర్శించడం వలన తప్ప, మరేది తనని ఈ కష్టాల నుంచి బయటపడేయలేదని భావించి ఊరు నుంచి బయలుదేరాడు. అలా ఆయన అనేక పుణ్య క్షేత్రాలు తిరుగుతూ తిరుమల చేరుకున్నాడు. ఇక్కడి జాబాలీ తీర్థంలో స్నానమాచరించగానే ఆయన శరీరం ... మనసు రెండూ తేలికపడ్డాయి. జీవితంపై అప్పటి వరకూ వున్న విరక్తి భావం ఒక్కసారిగా తొలగిపోయింది. భగవంతుడి అనుగ్రహంతో ఏదైనా సాధించవచ్చనే ఆశాభావం ఏర్పడింది. జాబాలీ తీర్థ మహిమే తనలోని మార్పుకు కారణమని ఆయన గ్రహించాడు.
ఈ తీర్థం వలన తన పాపాలు ... దోషాలు తొలగిపోయినట్టు తెలుసుకుని, వెంటనే స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాడు. జాబాలీ తీర్థ స్నాన ఫలితంగా ... స్వామి వారి దర్శన ఫలితంగా ఆ బ్రాహ్మణుడి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోయింది. అందువల తిరుమల వెళ్లినవారు జాబాలీ తీర్థంలో స్నానమాచరించడం మరిచిపోకూడదు.