ఆరోగ్యాన్నిచ్చే వినాయకుడు
వినాయకచవితి అనగానే పూలు ... పండ్లతో పాటు, పత్రి కోసం అన్వేషణ మొదలవుతుంది. పల్లెల్లో పత్రిని సంపాదించడం సంతోషంగా ... సంతృప్తికరంగా అనిపిస్తుంది. ఇక నగరాల్లో పత్రిని సంపాదించడం అసాధ్యం కాబట్టి వాటిని కొనడమే తప్ప మరో మార్గం కనిపించదు. వినాయకచవితి రోజున స్వామిని 21 రకాల పత్రితో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి వ్రతానికి సంబంధించిన పుస్తకంలోను వీటి ప్రస్తావన వుంటుంది.
మాచీపత్రం .. కరవీరం .. విష్ణుక్రాంత .. దేవదారు .. జాజీ పత్రం .. బదరీ పత్రం .. అశ్వత్థ పత్రం .. సిందువార పత్రం .. బిల్వ పత్రం .. దూర్వార యుగ్మం .. మరువక పత్రం .. చూతపత్రం .. గండకీ పత్రం .. దత్తూర పత్రం .. తులసీ పత్రం .. శమీపత్రం .. అపామార్గ పత్రం .. బృహతీ పత్రం .. దాడిమీ పత్రం .. అర్జున పత్రం .. అర్క పత్రం ... 21 రకాల పత్రాల జాబితాలో మనకి కనిపిస్తాయి.
ఈ పత్రాలను గణపతి పూజలో ఉపయోగించడం వెనుక పురాణ సంబంధమైన కారణమే కాకుండా, ఆరోగ్య సంబంధమైన కారణం కూడా వుందని శాస్త్రం చెబుతోంది. ఈ పత్రాలు సహజంగానే అనేక ఔషధాలను కలిగివుంటాయి. 'మాచీపత్రం' మూలవ్యాధినీ .. 'కరవీరం' చర్మ సంబంధమైన వ్యాధులను .. 'విష్ణుక్రాంత' కఫమును ...'దేవదారు'ఎక్కిళ్ళను నివారిస్తాయి.
ఇక 'జాజీ పత్రం' దగ్గును .. 'బదరీపత్రం' ఎముకలకు సంబంధించిన వ్యాధులను ... 'అశ్వత్థ పత్రం' పాముకాటు వలన కలిగే ప్రాణహానిని అరికడుతుంది. 'సిందువార పత్రం' శూలవ్యాధిని .. 'బిల్వపత్రం' శరీర దుర్వాసనను .. 'మరువక పత్రం' క్రిమికీటకాల వలన కలిగే విష ప్రభావాన్ని అరికడుతుంది. 'చూత పత్రం' విరేచనాలను ..'గండకీ పత్రం' మూర్ఛ వ్యాధిని ...'దత్తూర పత్రం' శిరోజాలు రాలడాన్ని ... 'తులసీ పత్రం' దగ్గు - కఫమును నివారిస్తాయి.
అలాగే 'అపామార్గ పత్రం' ఉబ్బసమును ... 'అర్క పత్రం' ఉదర సంబంధమైన వ్యాధులను ..'శమీపత్రం' శ్వాస సంబంధిత సమస్యలను అరికడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఈ పత్రాల నుంచి పూజ సమయంలో కూడా సహజంగానే వాసన వెలువడుతుంటుంది. ఈగాలిని పీల్చడం వలన కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని అంటారు.