ఆదుకునే ఆంజనేయుడు
హనుమంతుడు ఎంతటి శక్తిమంతుడో అంతటి వినయసంపన్నుడు. సమయాన్ని బట్టి బుద్ధికుశలతను ... సందర్భాన్ని బట్టి వీరత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఆయనలోని ఈ గుణాన్ని గ్రహించిన కారణంగానే శ్రీరాముడు ... సీత జాడను కనుక్కునే బాధ్యతను ఆయనకి అప్పగించాడు. అలాంటి హనుమంతుడు అనేక క్షేత్రాల్లో కొలువుదీరి భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. అలా ఆయన నెలవైన ప్రదేశమే గుంటూరు జిల్లాలోని 'బొప్పూడి'.
ప్రాచీన వైభవం కలిగిన చెన్నకేశవ - మల్లీశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం అలరారుతోంది. సాధారణంగా హనుమంతుడు కొలువైన ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నెలవైన ఆంజనేయుడు ఆపదలను నివారిస్తాడని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఈ రహదారిపై ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉండటంతో, కారణమేమిటో తెలియక స్థానికులు తీవ్రమైన ఆందోళన చెందసాగారు.
అప్పుడు స్వామి ఓ భక్తుడి కలలో కనిపించి తన విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ ప్రకారమే చేయడంతో అప్పటి నుంచి ప్రమాదాలు నివారించబడ్డాయని అంటారు. గర్భాలయంలో స్వామివారి నిలువెత్తు విగ్రహం 'సుందరం' అనే ఆయన పేరును సార్ధకంచేస్తూ అందంగా కనిపిస్తూ వుంటుంది. హనుమంతుడి రూపానికి తగిన విగ్రహం కావడంతో, అలంకరణకి అనుకూలంగా తేజస్సుతో వెలిగిపోతుంటుంది. భక్తులు స్వామివారికి తమలపాకుల దండలను ... వడ మాలలను సమర్పిస్తూ వుంటారు.
ప్రతినెలా స్వామివారి జన్మ నక్షత్రమైన 'పూర్వాభాద్ర'న భారీగా క్షీరాభిషేకం చేస్తుంటారు. ఇక ప్రతియేటా వైశాఖ మాసంలో వచ్చే 'హనుమజ్జయంతి'ని, స్వామి వారిని ప్రతిష్ఠించబడిన చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని అయిదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే వుంటుంది.