కంది పాండురంగడు

కంది పాండురంగడు
పరంధాముడు తన భక్తులను అనుగ్రహించడానికి అనేక రూపాల్లో అవతరించాడు. అలా ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలు వివిధ ప్రాంతాల్లో పుణ్య ఫలాలను పూయిస్తున్నాయి. భక్తుల పాలిట బంధువుగా ... పాపాలను హరించే పాండురంగడిగా ఆయన కొలువుదీరిన క్షేత్రమే 'కంది'.

మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని ఈ పురాతన క్షేత్రం, మంజీరానది తీరంలో దర్శనమిస్తుంది. పది ఎకరాలపైగా విస్తీర్ణాన్ని కలిగిన ప్రశాంతమైన ప్రదేశంలో ఈ ఆలయం విలసిల్లుతోంది. గర్భాలయంలో స్వామివారు రుక్మిణీ సమేతంగా కొలువై కనిపిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో సదాశివుడు ... లక్ష్మీనారాయణస్వామి కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం 'కార్తీక బహుళ పంచమి' రోజున స్వామివారికి ఘనంగా కల్యాణోత్సవం జరుగుతుంటుంది.

ఈ సందర్భంగా జరిగే 'గరుడోత్సవం' ... 'రథోత్సవం' వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఆ సమయంలో ఇక్కడి వాతావరణం భజనలతో ... కోలాటాలతో, సందడిగా ... నయనానందకరంగా కనిపిస్తూ వుంటుంది.

More Bhakti Articles