సలేశ్వరం
నల్లమల అడవుల్లో దాగి తనని వెదుక్కుంటూ భక్తులు వచ్చేలా చేసిన సాధుజన రక్షకుడు 'సలేశ్వరుడు'. పరమ పవిత్రమైన ఈ పుణ్య క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో నయనానందకరంగా కనిపిస్తుంది. కొండపై ఒక రాతి అడుగు భాగంలోని 'సరికె'లో వెలసినందువలన ఇక్కడి స్వామివారికి 'సరికేశ్వరుడు' అనే పేరు వచ్చిందని అంటారు. అది కాస్తా కాలక్రమంలో 'సలేశ్వరుడు'గా మారిపోయింది.
శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిలో గల 'పరహాబాద్' వరకూ వెళ్లి అక్కడి నుంచి నల్లమల అడవిలోకి ఓ 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవలసి వుంటుంది. అతికష్టంగా కొండలు ... లోయలు దాటుతూ ఇరుకైన కాలి బాటలో మరో పది కిలోమీటర్లు లోపలికి ప్రయాణం చేయవలసి వుంటుంది. కాలు మోపడానికి మాత్రమే అవకాశం ఉండే ఈ కాలి బాటను దాటుకుని వెళ్లాలంటే తప్పని సరిగా శివయ్య అనుగ్రహం ఉండవలసిందేనని అనిపిస్తుంది.
ఇక మూడు వందల అడుగుల పైనుంచి దూకే జలపాతం చూడగానే అప్పటి వరకూ పడిన కష్టం మటు మాయమైపోతుంది. ఈ జలపాతాన్ని ఒడిసి పట్టుకునే గుండంలో భక్తులు స్నానాలు చేస్తారు. ఇక్కడ వెలసిన స్వామివారిని కాకతీయుల నాటి కాలంలో గుర్తించినట్టు తెలుస్తోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో త్రేతా యుగంలోనూ ... ద్వాపర యుగంలోను మునీశ్వరులు తిరుగాడినట్టు చెబుతుంటారు. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు ఇక్కడే తపస్సు చేశాడనీ ... శివుడు బోయవాడి వేషంలో వచ్చి అతనితో తలపడిన ప్రదేశం ఇదేనని అంటుంటారు.
ఏడాది పొడవునా ఇక్కడ ఎవరూ కనిపించరు ... ఏడాదిలో మూడు రోజుల పాటు మాత్రమే ఇక్కడ శివయ్యకి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇలా మూడు రోజులు మాత్రమే ఉత్సవాలు జరపడానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ కనిపించవు ... ఇక్కడ భక్తులు ఉండటానికి ఎలాంటి వసతి సౌకర్యాలు లేకపోవడమేనని అనుకోవచ్చు. గుండె నిండుగా ధైర్యం ... మనసు నిండుగా భక్తి వుంటే, ప్రకృతి ఒడిలో అందంగా ... ఆహ్లాదంగా సేదదీరే శివయ్యను చూసి పరవశించిపోవడం ఖాయం.