ధర్మలింగేశ్వరం
కైలాసనాథుడు ధర్మలింగేశ్వరుడిగా వెలసిన పరమపవిత్రమైన ఈ పుణ్య క్షేత్రం విశాఖపట్నం సమీపంలో విరాజిల్లుతోంది. ఈ ప్రదేశంలో భూగర్భం నుంచి అయిదు నీటి ధారలు ఉబికి వస్తూ నిరంతరం ప్రవహిస్తూ వుంటాయి. ఈ కారణంగానే ఇక్కడ వెలసిన ధర్మలింగేశ్వరుడిని పంచధార్ల ధర్మలింగేశ్వరుడని పిలుస్తూ వుంటారు.
పూర్వం ఇక్కడ స్వయంభూ గా వెలసిన శివలింగం కాలక్రమంలో మరుగున పడిపోయిందట. ఆ సమయంలో యమధర్మరాజు తన కుష్టు వ్యాధిని నివారించుకోవడం కోసం శివలింగాన్ని తిరిగి ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. యమధర్మరాజు ఆరాధించిన కారణంగానే ఈ క్షేత్రానికి ధర్మలింగేశ్వరమనే పేరు వచ్చింది.
ఒకవైపున అద్భుతమైన శిల్పకళ ... అక్కడక్కడా శివలింగాలు ... గుహలు కనిపిస్తుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో కోటిలింగేశ్వరమనే భారీ శివలింగం ఒకటి వుంది. ఈ శివలింగానికి ఆలయం నిర్మించడానికి అక్కడి భక్తులు పూనుకుంటే, తనని ఆరుబయటే ఉంచమని స్వామి కలలో కనిపించి చెప్పాడట. దాంతో ఆ శివలింగం ఇప్పటికీ ఆరుబయటే కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉంటుంది.
ఇక సింహాచలంలో కొలువుదీరడానికి ముందు నరసింహస్వామి ఈ కొండపైకి వచ్చాడనే పురాణగాధ కూడా ఇక్కడ వినిపిస్తుంటుంది. అందుకు నిదర్శనంగా స్వామివారి పాదాలు కూడా ఇక్కడ దర్శనమిస్తుంటాయి. భక్తులపాలిట కొంగు బంగారమైన ధర్మలింగేశ్వరుడుకి 'ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి'రోజున అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరపబడుతుంది. కనులారా ఈ వేడుకను తిలకించడానికి విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు.