శ్రీ సంజీవరాయ హనుమంతుడు
హనుమంతుడు బలవంతుడు ... బుద్ధిమంతుడు ... అన్నింటికీ మించి ప్రభుభక్తి పరాయణుడు. ఎక్కడ రామ అనే శబ్దం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు నెలవై ఉంటాడు. ఎక్కడ హనుమంతుడు నెలవై ఉంటాడో అక్కడ శ్రీ రాముడు కొలువై ఉంటాడు. భగవంతుడి సరసన చోటు సంపాదించి ఆయనతో పాటు పూజలందుకుంటోన్న భాగ్యశాలి హనుమంతుడు.
పరాక్రమానికి ... వినయానికి ప్రతీక అయిన హనుమంతుడు అనేక క్షేత్రాల్లో ఆవిర్భవించాడు. అలా ఆయన అవతరించిన పుణ్య క్షేత్రం 'వెల్లాల'. పరమ పవిత్రమైన ఈ క్షేత్రం మనకు కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో దర్శనమిస్తుంది. రామ - రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు, శ్రీ రాముడు తల్లడిల్లి పోయాడు. స్వామి కన్నీరు హనుమంతుడిని కదిలించింది. తన స్వామి కళ్లలో ఆనందాన్ని చూడటం కోసం సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచించకుండా ఆయన 'సంజీవిని' మొక్క కోసం బయలుదేరాడు.
స్వామి ఆవేదనను చల్లార్చాలనే ఆత్రుతతో ఆయన వెళుతుండగా ఇక్కడి 'కుముద్వతి' నదీ తీరంలో ఋషులు దర్శించుకున్నారు. కాసేపు ఉండవలసిందిగా ఋషులు కోరడంతో క్షణకాలం మాత్రమే ఆగి, ''వెళ్లాలి ... వెళ్లాలి'' అంటూ హడావిడిగా బయలుదేరాడట. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'వెల్లాల' అనే పేరు వచ్చిందని అంటారు. సంజీవిని మొక్క కోసం వెళుతూ ఆగిన ప్రదేశం కావడం వలన స్వామివారిని 'సంజీవరాయ హనుమంతుడు'అని పిలుస్తుంటారు.
గర్భాలయంలో స్వామి వారి మూర్తి గంభీరంగా కనిపిస్తూ వుంటుంది. సంజీవిని మొక్క కోసం వెళ్లి పర్వతాన్ని పెకిలించుకుని వచ్చిన కారణంగా ఇక్కడి స్వామి మహా శక్తిమంతుడని చెబుతుంటారు. ఈ ఆంజనేయుడు పెరుగుతూ ఉండటంతో ... తలపై రాగి పాత్ర బోర్లించడం వలన ఆ పెరుగుదల ఆగిపోయిందని చెబుతుంటారు.
స్వామివారికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు చేయిస్తుంటారు. తులసి మాలలు ... వడ మాలలు సమర్పిస్తుంటారు. ఇక్కడ మొక్కుబళ్లుగా 'గంటలు' సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో అనేక ఉపాలయాలతో శొభిల్లుతోన్న ఈ క్షేత్రంలో శ్రీ రామనవమి ఉత్సవాలు ... హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు.