విజయానికి ముహూర్తం

విజయానికి ముహూర్తం
'విజయం' అనే మాటకు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ఎందుకంటే విజయంలో అంతులేని ఆనందం వుంటుంది ... సరిహద్దులులేని సంతోషం వుంటుంది. విజయం వలన కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి ... సిరి సంపదలు పెరుగుతాయి. అందువల్లనే ప్రతి ఒక్కరూ తమకి సంబంధించిన రంగాల్లో విజేతగా నిలవాలనీ, తాము తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేయాలని ఆశపడుతుంటారు ... ఆరాటపడుతుంటారు.

ఈ నేపథ్యంలో అందరూ కూడా మంచి ముహూర్తం చూసుకునే రంగంలోకి దిగుతూ వుంటారు. అయితే విజయానికంటూ ఒక ముహూర్తం ఉంటుందా అనే ప్రశ్నకి ... ఉంటుందని సమాధానం చెప్పవచ్చు. విజయం లభించే ఆ సమయం 'విజయదశమి' రోజున ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున సంధ్యా సమయం దాటిన తరువాత 48 నిమిషాలపాటు అమ్మవారు 'అపరాజిత' గా వుంటుంది. కనుక ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా అమ్మవారి అనుగ్రహం కారణంగా అది తప్పక విజయం సాధిస్తుందని స్కాదపురాణం స్పష్టంగా చెబుతోంది.

అపజయాలతో సతమతమైపోతున్న వారు ... అడ్డంకులతో అవస్థలు పడుతున్నవాళ్లు ఈ ముహూర్తంలో ఆయా పనులను ప్రారంభించడం వలన సఫలీకృతులు అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles