తాపత్రయం
నిత్యజీవితంలో 'తాపత్రయం' అనే మాటను మనం తరచూ వింటూనే వుంటాం. తమ వారు ఆపదలో వున్నప్పుడు వారిని రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు తాపత్రయ పడుతుంటారు. తమ పిల్లల విద్యా - ఉద్యోగాల విషయంలో తల్లిదండ్రులు తాపత్రయ పడుతుంటారు. ప్రేమ ... వాత్సల్యం ... వ్యామోహం తాపత్రయంలో ప్రధాన భూమికను పోషిస్తుంటాయి.
మానవులు వివిధ దశల్లో ఈ తాపత్రయానికి చిక్కుతూనే వుంటారు. తాపత్రయం అనే మాటను వివిధ సందర్భాల్లో వాడుతున్నప్పటికీ దాని పూర్తి అర్థం కొంతమందికి తెలియకపోవచ్చు. నిజానికి 'ఆధ్యాత్మిక' ... 'ఆధిభౌతిక' ... 'ఆధిదైవిక' అనే మూడు రకాల తాపాలను 'తాపత్రయం' అని అంటారు.
ఆధ్యాత్మిక తాపం రెండు రకాలుగా వుంటుంది. ఒకటి శారీరక పరమైనది కాగా .... మరొకటి మానసికపరమైనది. తలనొప్పి ... జ్వరం ... వాంతులు ... విరోచనాలు ... కంటికి సంబంధించిన వ్యాధులు ... చర్మ సంబంధమైన వ్యాధులు శారీరకమైన తాపంగా చెప్పబడుతున్నాయి. ఇక కామం ... క్రోధం ... మోహం ... లోభం ... ఈర్ష్యా ... అసూయ ... ద్వేషాలు మానసికపరమైన తాపంగా పురాణాలు చెబుతున్నాయి.
పక్షులు ... జంతువులు ... క్రిమి కీటకాల వలన కలిగే తాపాన్ని 'ఆది భౌతిక' తాపం అని అంటారు. వర్షాల వలన ... ఎండల వలన ... చలి వలన కలిగే తాపాన్ని 'ఆధిదైవిక' తాపమని అంటారు. ఇలా మూడురకాల తాపనలతో, తాపత్రయానికి చిక్కిన మానవులు, వాటి బారి నుంచి బయటపడటానికి ప్రయత్నించేలోగానే జీవితకాలం గడిచిపోతుంటుంది.