అధిక మాస ప్రభావం
సూర్యుడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. ఈ విధంగా మారడాన్ని సూర్య సంక్రమణం అని అంటూ వుంటారు. ఈ నేపథ్యంలో ఏనెలలోనైతే సూర్య సంక్రమణం జరగదో ఆ నెలను 'అధికమాసం' గా చెబుతుంటారు. ఇక చంద్ర గమనాన్ని బట్టి చూస్తే, చంద్రుడు తాను ఉండవలసిన నక్షత్రంలో కాకుండా వేరే నక్షత్రంలో ఉండటాన్ని 'అధికమాసం' గా భావిస్తుంటారు.
ఈ అధిక మాసం అనేది తనకన్నా ముందుగా వచ్చే నెలను ... తన తరువాత వచ్చే నెలను కూడా ప్రభావితం చేస్తుంటుంది. ఈ కారణంగానే వైశాఖ మాసం ముందు అధికమాసం అయితే దానిని అధిక వైశాఖం అని అంటారు. ఆ తరువాత వచ్చే వైశాఖ మాసాన్ని నిజ వైశాఖం అని అంటారు.
అధికమాసంలో నిత్య పూజలు ... దానధర్మాలు చేయవచ్చనీ, శుభకార్యాలు ... నోములు - వ్రతాలు ... దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రం జరుపకూడదని శాస్త్రం చెబుతోంది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం వలన దోషపరమైన ఫలితాలను పొందవలసి వస్తుందని అంటోంది.