పావులూరు హనుమంతుడు
సీతారాములు ఎక్కడ వుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. హనుమంతుడు ఎక్కడ వుంటే అభయం ... అనుగ్రహం అక్కడ వుంటాయి. పావులూరులో వెలసిన హనుమంతుడు ఇదే విషయాన్ని మరో మారు స్పష్టం చేస్తున్నాడు. వీరాంజనేయ క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ గ్రామం ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో దర్శనమిస్తుంది. పూర్వం ఈ ఆలయం పొలిమేరలో వుండటం వలన ఇక్కడి స్వామిని పొలిమేర వీరాంజనేయుడిగా పిలుస్తుంటారు.
ఇక్కడ స్వామివారు ప్రత్యేకమైన గర్భాలయంలో కొలువుదీరి ఉండకపోవడం విశేషం. ఆలయ మధ్య భాగంలో మందిరం వంటి ప్రదేశంలో స్వామి దర్శనమిస్తుంటాడు. ఆ పక్కనే సీతారాముల ఆలయం కూడా కనిపిస్తుంటుంది. వారిని కనిపెట్టుకుంటూనే ఆయన భక్తులను అనుగ్రహిస్తుంటాడు. వీరాంజనేయ స్వామికి ప్రతినిత్యం పూజాభిషేకాలు ... ఆకుపూజలు నిర్వహిస్తుంటారు. మంగళవారం రోజున ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.
ప్రతియేటా స్వామివారికి కల్యాణోత్సవం ... హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. గ్రహ పీడల వలన ... దుష్ట శక్తుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన బయటపడిపోతారని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.