నవవిధ భక్తి మార్గాలు
'నవవిధ భక్తి మార్గాలు' గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. భగవంతుడిని భక్తులు సేవించి తరించడానికి
'శ్రవణం' ... 'కీర్తనం' ... 'స్మరణం' ... 'పాదసేవనం' ... 'అర్చనం' ... ' వందనం' ... 'దాస్యం' ... 'సఖ్యం' .. 'ఆత్మనివేదనం' వంటి తొమ్మిది భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యం అవుతుందని అవి చెబుతున్నాయి.
ఈ తొమ్మిది మార్గాల్లో ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు. అలాంటివారిని ఆదర్శంగా తీసుకోవడం వలన, ఆధ్యాత్మిక జీవితం అనూహ్యమైన స్థాయిలో ప్రభావితమవుతుంది. నవవిధ భక్తి మార్గాలను అనుసరించిన భక్తులను పరిశీలిస్తే ... శుకుడి ద్వారా దైవ సంబంధమైన కథలు వింటూ పరీక్షిత్తు మహారాజు 'శ్రవణ' మార్గంలో కనిపిస్తాడు. నిరంతరం దైవనామ సం'కీర్తన' మార్గంలో నారదుడు దర్శనమిస్తాడు.
ఇక అనుక్షణం దైవనామ 'స్మరణం'లో తరిస్తూ ప్రహ్లాదుడు, 'పాదసేవనం' మార్గాన్ని అనుసరించి రుక్మిణీ దేవి దైవానుగ్రహాన్ని పొందారు. అనునిత్యం దైవాన్ని అర్చిస్తూ 'అర్చన' పద్ధతిలో అంబరీషుడు, 'వందనం' మార్గంలో అక్రూరుడు భగవంతుడి కృపకు పాత్రులయ్యారు. ఇక 'దాస్య' భక్తికి హనుమంతుడు ... 'సఖ్య'తకు కృష్ణార్జునులు ... 'ఆత్మనివేదన'కు భీష్ముడు నిలువెత్తు నిర్వచనాల్లా నిలిచారు.