మహాగణపతి
అష్ట గణపతులలో ఒకటైన 'శ్రీ మహాగణపతి' క్షేత్రం పూణే జిల్లాలోని శిరూర్ తాలూకాలోని 'రంజన్ గావ్'లో వెలసింది. అష్ట గణపతులకి సంబంధించిన ఆలయాలలో ఇదే పెద్దదిగా కనిపిస్తూ వుంటుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు సూర్య కిరణాలు ఇక్కడి విగ్రహంపై పడుతుంటాయి. ఈ విశేషాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
ఈ క్షేత్రంలో అసలు మూలవిరాట్టు భూగర్భంలో ఉందనీ, వెలుపలి మంటపంలో మరో విగ్రహాన్ని వుంచి పూజిస్తున్నట్టుగా స్థానికులు చెబుతుంటారు. గతంలో జరిగిన కొన్ని మతపరమైన దాడుల కారణంగానే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని అంటారు. ఇక స్వామివారు ఇక్కడ వెలసిన తీరు గురించి 'గణేశ పురాణం'లో ప్రస్తావించడం జరిగింది.
'గృత్స మదుడు' తుమ్ములో నుంచి జన్మించిన బాలకుడు, వినాయకుడి కటాక్షం కోసం చాలాకాలం తపస్సు చేశాడు. తన ఆదేశం మేరకు సంచరించే మూడు పురాలను ... శివుడి కారణంగా మోక్షం లభించే అవకాశం ఇవ్వమని కోరాడు. తదనంతరం అతనే త్రిపురాసురుడై లోక కంటకుడిగా మారాడు. అప్పుడు శివుడు భూమిని రథం గాను .. సూర్య చంద్రులను రథ చక్రాల గాను .. శ్రీ మహా విష్ణువును బాణంగా చేసుకుని త్రిపురాసురుడిని సంహరించాడు. దీనంతటికి కారకుడైన వినాయకుడిని అభినందించి, ఆయన విగ్రహాన్ని శివుడే ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశ పురాణం చెబుతోంది.