స్తంభాద్రి నారసింహుడు
శ్రీ మహావిష్ణువు ... నరసింహస్వామిగా 'స్తంభం' నుంచే అవతరించాడు. ఆ తరువాత ఆయన స్తంభంలా నిటారుగా గల కొండపై కొలువుదీరాడు. ఈ కారణంగానే ఆ కొండను 'స్తంభాద్రి'గా పిలుస్తుంటారు. అత్యంత శక్తిమంతమైన ఈ క్షేత్రం 'ఖమ్మం'లో అలరారుతోంది. ప్రాచీన కాలంనాటి ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించిన వైనాన్ని పరిశీలిస్తే, అందుకు కారణం 'మౌద్గల్యుడు' అనే మహర్షి అని తెలుస్తోంది.
మౌద్గల్యుడు శ్రీమన్నారాయణుడి కోసం ఈ కొండపై కఠోరమైన తపస్సు చేయగా, స్వామివారు లక్ష్మీ సమేతుడైన నృసింహ స్వామిగా ప్రత్యక్షమయ్యాడు. భక్తులను అనుగ్రహించడం కోసం అదే అవతారంలో అక్కడ కొలువుదీరి ఉండవలసిందిగా మహర్షి కోరడంతో స్వామి అదే రూపంలో అక్కడ వెలిశాడు. అప్పటి నుంచి ఎందరో మహనీయులు స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తూ వచ్చారు.
స్వామివారి మహిమ గురించి తెలిసిన కాకతీయ రాజులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినట్టుగా ఆధారాలు వున్నాయి. గర్భాలయంలో లక్ష్మీ సమేతుడైన నృసింహుడికి ప్రతి ఉదయం 'పానకం'తోను ... శుక్రవారం రోజున అమ్మవారికి పాలతోను అభిషేకం చేస్తారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిములు కూడా ఇక్కడి స్వామి వారికి మొక్కుబడులు చెల్లిస్తుండటం విశేషం.
ఇక ఇక్కడి కోనేరు మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఎందుకంటే .. స్వామి పూజకు అక్కడ నీరు లేకపోవడం గురించి మౌద్గల్యుడు ఆవేదనను వ్యక్తం చేయగా, స్వామివారు ఒక చోట తన పాదాన్ని తాకించారట. దాంతో అక్కడి నుంచి జలధార మొదలై కోనేరుగా ఏర్పడిందని అంటారు. స్వామివారు అవతరించిన వైశాఖ శుద్ధ చతుర్దశి రోజుని పురస్కరించుకుని ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో వివిధ రకాల వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు.