మహిమాన్విత కాణిపాకం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే!
అంటూ ప్రతి శుభకార్యానికి ముందు ఈ శ్లోకాన్ని పటిస్తూ ఉంటారు. ఇక పూజలు ... నోములు ... వ్రతాలు ఏవైనా ఈ శ్లోకంతో ప్రారంభం కావలసిందే. వినాయకుడికి గణాధిపత్యాన్ని ఇచ్చిన తరువాత దేవకార్యాలే ఆయనను స్తుతిస్తూ ప్రారంభవుతుండగా, ఇక సామాన్య మానవుల సంగతి వేరే చెప్పాలా. తాము తలపెట్టిన ఏ కార్యమైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి కావడం కోసం అందరూ వినాయకుని శరణు కోరుతూనే ఉన్నారు ... ఆయన అభయాన్ని పొందుతూనే ఉన్నారు. అలా భక్తులపాలిట కొంగు బంగారమైన స్వామి అనేక క్షేత్రాలలో దర్శనమిస్తున్నప్పటికీ, ఆయన స్వయంభువుగా వెలసిన 'కాణిపాకం' క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కోరిన వరాలను సిద్ధింపజేసే ఈ వరసిద్ధి వినాయక క్షేత్రం చిత్తూరుకు 12 కిలోమీటర్ల దూరంలో అలరారుతూ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది.
ఇక ఈ దివ్య క్షేత్రానికి 'కాణిపాకం' అనే పేరు ఎలా వచ్చిందనే విషయమై ఓ కథ ప్రచారంలో ఉంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 'విమారపురి' అనే ప్రాంతంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేకపోవడంతో ఊరు ఊరంతా అల్లాడి పోతోంది. అంతవరకూ ఆ ఊరి ప్రజలపై ఆధారపడిన ఓ గుడ్డివాడు ... ఓ కుంటివాడు ... ఓ మూగవాడు ఆలోచనలో పడ్డారు. ఊరు బాగుకోసం తాము ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ముగ్గురూ కలిసి ఒక ప్రదేశంలో బావిని తవ్వడం మొదలు పెట్టారు. మూగవాడు ... చెవిటివాడు మట్టి తవ్వుతూ ఉంటే, మట్టిని పారబోసి తిరిగి తొట్టిని లోపలికి వదిలే పనిని గుడ్డివాడు చేస్తున్నాడు . అలా కొన్ని రోజులపాటు బావిని తవ్విన తరువాత ఒక రోజున గడ్డపారకి 'ఠంగ్' మంటూ రాయి తగిలిన శబ్దం వచ్చింది. ఆ శబ్దం వెలువడగానే చెవిటి వాడికి వినికిడి శక్తి ... మూగవానికి మాట వచ్చాయి. ఆ శబ్దం వచ్చిన చోటు నుంచి బుడ బుడమంటూ రక్తం పైకి పొంగుకొచ్చింది. చూస్తుండగానే దాని ధార పెద్దదై పైకి చిమ్మింది. ఆ రక్తం గుడ్డివాడి పై పడగానే అతనికి చూపు వచ్చింది. వెంటనే అతను పరిగెత్తుకు వెళ్లి రాజుగారికి ఈ విషయం చెప్పడంతో, రాజుతో సహా ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. లోపల ఏదో శక్తి వుందని గ్రహించి దానిని శాంతింపజేయడం కోసం అంతా కొబ్బరికాయలు కొట్టారు. దాంతో ఆ కొబ్బరి నీళ్లు కాణి (1. 3 ఎకరం ) మేర పారడంతో, 'కాణి పారకం' కాస్త కాలక్రమంలో 'కాణిపాకం' పేరుతో స్థిరపడినట్టు తెలుస్తోంది.
బావిలో వినాయక విగ్రహం వుందని తెలియడంతో దానిని బయటికి తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో ఇక అక్కడే విగ్రహాన్ని వుంచి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శాశ్వత మనుకున్న లోపాలను స్వామివారు క్షణకాలంలో మటుమాయం చేసినట్టు చరిత్ర చెబుతూ ఉండటంతో, భక్తులు ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. ఇక ఇక్కడి విగ్రహం ప్రతి ఏడాది పెరుగుతోందని చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారికి గతంలో సరిపోయిన కవచాలు ఇప్పుడు సరిపోకపోవడాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. కాలక్రమంలో ఇక్కడ వినాయకుడితో పాటు శివకేశవులు కొలువుదీరి కనిపిస్తారు. శైవ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతూ ... కోరిన వారికి కోటి జన్మల పుణ్య ఫలాలను అందిస్తోన్న ఆ వరసిద్ధి వినాయకుడిని మనసారా స్మరిద్దాం ... తన్మయత్వంతో తరిద్దాం.