లక్ష్మిని తెచ్చే గవ్వలు
లక్ష్మీదేవి సముద్రుడి కూతురు ... అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్లనీ, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు. అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట ... పూజా మందిరాల్లోనూ వుంచుతుంటారు. ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు ... వాహనాలకు కడుతూ వుంటారు.
పూర్వం నాణాలకు బదులుగా గవ్వలు చెలామణిలో ఉండేవి. ఇప్పటికి కూడా డబ్బులేని సమయంలో చిల్లిగవ్వలేదని అంటూవుంటాం. దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుందని చాలామంది పూజలు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గవ్వలు ఆడుతూ లక్ష్మీ దేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.