నవదుర్గా రూపాలు

దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ కోసం ఆదిపరాశక్తి ... నవదుర్గలుగా అవతరించింది. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఈ తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటుంది. 'దేవీ భాగవతం'లో నవదుర్గల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావించడం జరిగింది. నవదుర్గల్లో తొలి అవతారమైన 'శైలపుత్రి' కుడిచేతిలో త్రిశూలం ... ఎడమ చేతిలో కమలం ధరించి కనిపిస్తుంది. 'వృషభ వాహనం' పై సచారిస్తూ వుంటుంది.

ఇక రెండవ అవతారమైన 'బ్రహ్మచారిణి' ఒకచేతిలో జపమాల ... మరో చేతిలో కమండలం ధరించి దర్శనమిస్తుంది. మూడవ అవతారమైన 'చంద్ర ఘంట' 'పులి వాహనం'పై సంచరిస్తూ భూత ప్రేతాలను తరిమికొడుతూ వుంటుంది. నాల్గొవ అవతారమైన 'కూష్మాండ' కూడా 'పులి వాహనం' అధిష్ఠించి తన భక్తులను కాపాడుతూ వుంటుంది. అయిదవ అవతారమైన 'స్కందమాత' 'సింహ వాహనం' అధిష్ఠించి, ఒడిలో కుమారస్వామితో కనిపిస్తుంది.

ఆరవ అవతారమైన 'కాత్యాయని' కూడా 'సింహ వాహనం' పై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఏడవ అవతారమైన 'కాళరాత్రి' భయంకరమైన రూపంలో 'గాడిద వాహనం'పై కనిపిస్తుంది. ఇక ఎనిమిదవ అవతారమైన 'మహా గౌరీ' అభయ ... వరద ముద్రలతో దర్శనమిస్తుంటుంది. ఈ అమ్మవారు 'ఎద్దు వాహనం' పై సంచరిస్తూ వుంటుంది. తొమ్మిదవ అవతారమైన 'సిద్ధి ధాత్రి' కమలాసనం పై పద్మాసన స్థితిలో కూర్చుని శరణు కోరిన వారిని కరుణతో అనుగ్రహిస్తుంటుంది.


More Bhakti News