బుగ్గ రామలింగేశ్వరుడు
పరమశివుడు ... బుగ్గ రామేశ్వరుడిగా దర్శనమిస్తోన్న క్షేత్రం కర్నూల్ జిల్లా ... 'కానాల'లో విలసిల్లుతోంది. ప్రస్తుతం ఇది 'కాల్వబుగ్గ'గా పిలవబడుతోంది. ఇక్కడి నీటి బుగ్గలో భక్తులు స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు. మహా శివరాత్రి పర్వదినాన ఇక్కడ విశేష పూజలను ... ఉత్సవాలను ఘనంగా జరిపిస్తుంటారు.
ఇక్కడ నిర్మాణపరమైన విశేషాలు పెద్దగా లేకపోయినప్పటికీ, ఈ స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అందుకు కారణం శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకరిగా చెప్పబడుతున్న 'పింగళి సూరన' ఈ ఆలయాన్ని నిర్మించడమే. 'కళాపూర్ణోదయం' అనే ప్రబంధాన్ని రచించిన సూరన ... దానిని కృష్ణమరాజుకు అంకితమివ్వడంతో, అందుకు బహుమతిగా ఆయన సూరనకు కానాల గ్రామాన్ని ఇచ్చాడు.
అలా తనకి వచ్చిన పొలాలలో కొంత భాగాన్ని సూరన సాగుచేసుకుంటూ, మిగతాభాగంలో రామలింగేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు. సూరన బతికున్నంత కాలం ఇక్కడి స్వామివారిని సేవించుకుంటూ గడిపాడు. ఆ తరువాత కాలంలో ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోగా భక్తులు పూనుకుని మరమ్మత్తులు చేయించారు.
ఇప్పుడీ ఆలయంగల ప్రదేశం సూరన కాలనీగా పిలవబడుతోంది. అంతే కాకుండా విశేషమైన పర్వదినాల్లో జరిగే ఉత్సవాలలో తొలి తాంబూలం సూరన పేరున ఇవ్వడం జరుగుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే అటు రాయలవారితోను ... ఇటు బుగ్గ రామలింగేశ్వరుడితోను సూరనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, అనిర్వచనీయమైన అనుభూతిని పొందవచ్చుననడంలో ఎలాంటి సందేహం లేదు.