కొప్పు లింగేశ్వరుడు
సాధారణంగా శివలింగం పై భాగం నున్నగా ఉండి ... అభిషేక ద్రవ్యాలు సున్నితంగా జారిపోతుంటాయి. అలా కాకుండా ఆ శివలింగంపై 'కొప్పు' ఆకారముంటే చూడటానికి కాస్త వింతగా అనిపిస్తూ వుంటుంది. అలా వింతగా ... విశిష్టంగా కనిపించే శివలింగం మనకి తూర్పు గోదావరి జిల్లా 'పలివెల' లో దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి తలపై కొప్పుతో కనిపిస్తూ 'కొప్పు లింగేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.
ఇక స్వామి వారికి మొదటి నుంచి కొప్పు వుండేది కాదనీ ... మధ్యలో వచ్చిందంటూ అందుకు కారణమైన కథ ఒకటి స్థల పురాణంగా మనకి వినిపిస్తుంది. పూర్వం క్షీర సాగర మథనంలో నుంచి ఆవిర్భవించిన శివలింగాన్ని, అమ్మవారితో సహా అగస్త్య మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించేవాడు.
ఈ శివలింగానికి కాలక్రమంలో ఒక పూజారి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉండేవాడు. వేశ్య కుటుంబానికి చెందిన ఒక స్త్రీతో ఆయన కాస్త చనువుగా ఉంటున్నాడనే విషయం రాజుగారి వరకూ వెళ్లింది. దాంతో అసలు విషయం తెలుసుకునేందుకు రాజు గారే ఆలయానికి వచ్చాడు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి మెడలోని పూలమాలను రాజుగారి మెడలో వేశాడు పూజారి.
ఆ దండకి పొడవైన వెంట్రుక వుండటం చూసిన రాజు దాని గురించి అడిగాడు. అది వేశ్యచే కట్టబడిన మాల కావడంతో, ఆ విషయం చెప్పలేక పూజారి కంగారు పడిపోయాడు. ఆ కంగారులో శివుడికే శిరోజాలు మొలిచినట్టు చెప్పాడు. అవి చూడటానికి రాజుగారు ఆసక్తిని కనబరచడంతో, మరునాడు ఉదయం అభిషేకం సమయంలో చూపిస్తానని చెప్పి పంపించి వేశాడు.
తాను చెప్పినది అబద్ధమని తేలితే రాజుగారు శిక్షిస్తాడని భయపడి, తాను చెప్పినదే నిజమయ్యేలా చేయమని ఆ రాత్రంతా శివలింగాన్ని పట్టుకుని వదలలేదు. మహాశివుడి మనసు కరగడంతో, రాజుగారు వచ్చే సమయానికి శివలింగానికి కొప్పు ఏర్పడింది. ఈ మహిమ కారణంగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఇక్కడి స్వామిని దర్శించుకుని వెళుతుంటారు.