అష్ట దిక్పాలకులు

అష్ట దిక్కులను పరిపాలించే అధిదేవతలనే అష్ట దిక్పాలకులు అంటారు. ఇంద్రుడు ... అగ్ని ... యముడు ... నిరుతి ... వరుణుడు ... వాయువు ... కుబేరుడు ... శివుడు అష్ట దిక్పాలకులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో తూర్పు దిక్కుకు 'ఇంద్రుడు' ... ఆగ్నేయానికి 'అగ్ని' ... నైరుతికి 'నిరుతి' ... పడమర దిక్కుకు 'వరుణుడు' ... వాయువ్యానికి 'వాయువు' ... ఉత్తరానికి 'కుభేరుడు' ... ఈశాన్యానికి 'శివుడు' అధిపతులుగా వున్నారు.

ఐరావతమనే 'ఏనుగు'పై ఇంద్రుడు ... 'పొట్టేలు'పై అగ్ని ... 'మహిషం' పై యముడు ... 'నరుడు' పై నిరుతి ... 'మకరం' పై వరుణుడు ... 'జింక' పై వాయువు ... 'శ్వేతాశ్వం' పై కుబేరుడు ... 'వృషభం' పై శివుడు సంచరిస్తూ అష్ట దిక్కులను పరిపాలిస్తూ వుంటారు.


More Bhakti News