అష్టగణపతులు
ప్రపంచం మొత్తంగా ప్రధమ పూజలు అందుకుంటోన్న దైవం వినాయకుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెడు పనులకు ఆటంకాలు కలిగించడానికీ ... మంచి పనులకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా చూడటానికి అవతరించిన వినాయకుడిని వివిధ దేశాల్లో ... వివిధ రూపాల్లో ... పలురకాల పేర్లతో పూజిస్తూ వుంటారు. మనదేశంలో వినాయకుడికి వున్నవిశిష్టత ... ఆయన ఉత్సవాలకి వున్న ఆదరణ అంతా ఇంతా కాదు. వినాయకుడు ఎన్నో ప్రాంతాల్లో స్వయంభూగా వెలసినప్పటికీ, మహారాష్ట్రలోని 'మోర్ గాం' ... 'సిద్ధి టేక్' ... ' పాలీ' ... ' మహాడ్' ... ' ధేవూర్' ... 'లేన్యాద్రి' ... 'ఓఝర్' ... 'రంజన్ గామ్' అనే క్షేత్రాలు మాత్రమే 'అష్ట గణపతి' క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
ఈ 'అష్ట గణపతులు'లో ప్రతి గణపతికి పురాణ నేపథ్యం వుంది. ప్రతి గణపతి పవిత్రతకి ప్రతీకగా కనిపిస్తూ ... కరుణిస్తూ భక్తులపాలిట కొంగుబంగారమై అలరారుతున్నారు. అలాంటి అష్టగణపతులలో ముందుగా మనం 'మోర్ గామ్' గురించి తెలుసుకుందాం. సాధారణంగా గణపతి మూషిక వాహనధారుడై మనకి కనిపిస్తూ ఉంటాడు. కానీ 'మోర్ గామ్' క్షేత్రంలో మాత్రం 'నెమలి' వాహనధారుడై కనువిందు చేస్తుంటాడు.
ఈ క్షేత్రం మహారాష్ట్ర - పూణేకు 79 కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతోంది. మరాఠీలో 'మోర్' అంటే 'నెమలి' అని అర్థం. ఈ కారణంగానే మయూర వాహనంపై కొలువుదీరిన ఇక్కడి స్వామిని అందరూ మయూరేశ్వరుడని ... మోరేశ్వరుడని పిలుస్తూ వుంటారు. సహజంగానే ఇక్కడ నెమళ్లు ఎక్కువగా సంచరిస్తూ వుంటాయి కనుక, ఈ ప్రాంతానికి 'మోర్ గామ్' అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ గ్రామం కూడా నెమలి ఆకారంలో వుండటం ... నెమళ్లు ఇక్కడికి ఎక్కువగా రావడం ... స్వామివారు కూడా నెమలి వాహనాన్ని అధిష్టించడం కారణంగా ఈ క్షేత్రం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.
గర్భాలయంలో సిద్ధి - బుద్ధి సమేతంగా వినాయకుడు దర్శనమిస్తుంటాడు. ఇక గర్భాలయంలో కొలువుదీరిన స్వామివారికి ఎదురుగా, కాస్త చిన్నబుచ్చుకున్నట్టుగా మూషికవాహనం కనిపిస్తుంటుంది. దేవతల కోరిక మేరకు విశ్వకర్మ ఈ దేవాలయాన్ని నిర్మించి, వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా స్థానిక కథనం మనకి వినిపిస్తూ వుంటుంది.