రాహుగ్రహ ప్రభావం
జీవితంలో ఎలాంటి కష్టాలు ... ఇబ్బందులు రాకూడదని అనుకుంటామో, ఎలాంటి అవస్థలు పడకూడదని అనుకుంటామో అలాంటి వాటిని వరుసగా అనుభవంలోకి తీసుకు వచ్చే వాడే రాహువు. రాశి ఫలాలు ... జాతక చక్రాల సంగతి అటుంచితే, రాహువు ప్రవేశించాడు అంటే మనఃశాంతి మచ్చుకి కూడా లేకుండా చేస్తాడు.
సాధ్యమైనంత వరకూ ఏ పని కాకుండా అడ్డుపడతాడు ... ఒకవేళ పూర్తి చేసినా సరైన ఫలితం రానియ్యడు. తానున్న చోట కీర్తి ప్రతిష్ఠలు ... సుఖ సంతోషాలు లేకుండా చేస్తాడు. ముందు రాహువును సంతృప్తి పరిచి ఆయనను శాంతింపజేసిన తరువాతనే మిగతా పనులు చూసుకుందాం అన్నంతగా విసిగిస్తాడు. ఈ కారణంగానే రాహువు వలన ఇబ్బందులు పడుతున్న వాళ్లంతా, అయన అనుగ్రహం కోసం క్షేత్రాలన్నీ తిరుగుతూ వుంటారు.
ఈ విషయంలో రాహుగ్రహానికి శాంతి చేయడానికి హోమాలు ... జపతపాలు చేయమంటూనే శాస్త్రం ఓ సూచన చేస్తోంది. అనునిత్యం అమ్మవారిని ఆరాధించడం వలన రాహువు చూపే ప్రభావంలోని తీవ్రత తగ్గుతుందని చెబుతోంది. ముఖ్యంగా గిరిదుర్గ లేదా వనదుర్గను పూజించడం వలన రాహువు అనుగ్రహం లభించే అవకాశాలు వున్నాయని అంటోంది. కనుక రాహుగ్రహ బాధితులు ఆయన మనసు గెలుచుకోవాలంటే, అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయించ వలసిందేనన్న విషయం స్పష్టమవుతోంది.