ఆధ్యాత్మిక చింతన

ఆధ్యాత్మిక చింతన
ఆధ్యాత్మిక చింతన అనేది వయసు పైబడినప్పుడు చేయవలసిన పని అని చాలా మంది అనుకుంటూ వుంటారు. అయితే వయసు పైబడినప్పుడు అనారోగ్యాలు చుట్టుముడతాయి కనుక, వయసులో ఉండగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని వివేకానందుడు వంటి మహనీయులు సెలవిచ్చారు.

ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రారంభించాలనే విషయంలోను ... భక్తి సోపానాలను అధిరోహించడానికి ఏం చేయాలనే విషయంలోనూ చాలా మందికి చాలా సందేహాలు ఉంటూ వుంటాయి. అలాంటి వారికి మహనీయులు 'ఆరు విధులు' సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని ఆహ్వానించే వారు ... ఆస్వాదించే వారు ఈ ఆరు విధులను పాటించవలసి వుంటుంది.

ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో 'సూర్య నమస్కారం' చేయాలి. సకల శబ్ద సమ్మిళితంగా ఏర్పడిన 'ఓంకారం'ను స్మరిస్తూ వుండాలి. జ్ఞాన ... భక్తి ... కర్మ ... మార్గాలను భోదించే 'భగవద్గీత'ను పఠిస్తూ వుండాలి. అనునిత్యం 'ఇష్టదేవతారాధన'చేస్తూ వుండాలి. సమస్త దేవతల నివాస స్థలమైన తులసిని పూజించాలి. వీలైతే ఉదయం ... లేదంటే సాయంత్రం వేళ దేవాలయానికి వెళ్లి 'దైవదర్శనం' చేయాలి. ఈ విధంగా చేయడం వలన అశాంతి దూరమవుతుంది ... మనసు పవిత్రమై ప్రశాంతతకు నిలయమవుతుంది ... ఆధ్యాత్మిక మార్గం మరింత సుగమం అవుతుంది.

More Bhakti Articles