నాసిక్
సాక్షాత్తు భగవంతుడే అవతార పురుషుడిగా నడయాడిన ప్రదేశాలు ... భగవంతుడి రూపాలు ప్రతిష్ఠించబడిన ప్రదేశాలు పుణ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో ఒకటిగా 'నాసిక్' కనిపిస్తుంది. పుష్కర కాలానికి ఒకసారి 'కుంభమేళ' జరుపుకునే పుణ్య క్షేత్రాలలో 'నాసిక్ ఒకటిగా వెలుగొందుతోంది.
మహారాష్ట్రానికి చెందిన నాసిక్ నగరం రెండు భాగాలుగా కనిపిస్తుంది. గోదావరి నదికి ఉత్తరపు ఒడ్డున నాసిక్ ... దక్షిణం ఒడ్డున పంచవటి దర్శనమిస్తాయి. త్రేతా యుగంలో సీతా రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని అంటారు. ఈ సమయంలోనే శూర్పణఖ మాయవేషంలోరాగా ... లక్ష్మణుడు ఆమె నాసిక ( ముక్కు) కోసి పంపించాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'నాసిక్'అనే పేరు వచ్చినదని చెబుతారు.
ఇక సీతారాముల కోసం లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాల ... రామకుండ్ ... సీత గుహ ... లక్ష్మణ రేఖ కూడా ఆనాటి ఘట్టాలను కళ్ల ముందుంచుతాయి. ఈ క్షేత్రానికి దగ్గరలో చాలా పుణ్య తీర్థాలు వుండటం వలన ఇక్కడికి వచ్చిన భక్తులు వాటిని కూడా దర్శిస్తూ తరిస్తుంటారు. ఇక్కడ పవిత్ర గోదావరి పరుగులు తీస్తూ వుండటం వలన ... ఈ తీరంలో అనేక దేవాలయాలు కొలువుదీరి వున్న కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే వుంటుంది. ఇక కుంభమేళ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడి గోదావరిలో స్నానమాచరించి పుణ్య ఫలాలను పొందుతుంటారు.