విజయాలను ప్రసాదించే చెన్నకేశవస్వామి

చెన్నకేశవస్వామి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి, పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన క్షేత్రాలలో ఒకటిగా 'కోయిలవాయి' కనిపిస్తుంది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 'కోయిలవాయి' గ్రామానికి సమీపంలో కొండల బారు కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండల్లో ఒక కొండపై స్వామివారు ఆవిర్భవించాడు. ఒక భక్తుడికి తన జాడను తెలియపరచి, ఆ రోజు నుంచి నిత్య పూజలు అందుకుంటున్నాడు.

కొండపై చిన్న చిన్న నీటి గుంతలు .. 'గుండాలు' పేరుతో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో గుండం, ఒక్కో పేరుతో పిలవబడుతూ, ఆలయ మహాత్మ్యాన్ని చాటిచెబుతుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన, విజయాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్లనే కొత్తగా ఏదైనా కార్యాన్ని తలపెట్టేవారు, ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని ఆయనకి చెప్పుకుని వెళుతుంటారు. అలా చేయడం వలన తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News