రాహు కేతువులు ఇలా కూడా శాంతిస్తారట

రాహు - కేతు దోషాల వలన అనేక బాధలు .. ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ దోషాలకి నివారణ చేసుకోవడానికి ఎవరిస్థాయిలో వాళ్లు ప్రయత్నిస్తుంటారు. రాహు కేతువులు ఛాయా గ్రహాలుగా చెప్పబడుతున్నాయి. దుర్గాదేవిని ఛాయా రూపేణ అంటూ ఆరాధిస్తారు. అందువలన అనునిత్యం దుర్గాదేవిని పూజించడం వలన రాహు కేతువులు శాంతిస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

సోమవారం రోజున శివ సహస్ర నామావళినీ, మంగళవారం రోజున హనుమంతుడి సహస్రనామావళిని పఠించడం వలన కూడా రాహు కేతువులు శాంతిస్తారు. ఇక నరసింహస్వామికి పూజాభిషేకాలు చేయడం వలన కూడా రాహు కేతు దోషాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. రాహు కేతు దోషాలు పెట్టే ఇబ్బందులు ఎక్కువగా వున్నప్పుడు, మహా మృత్యుంజయ మంత్ర జపం చేయించడం వలన, వెంటనే ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News