కోన రంగనాథుడు
ఆలూరుకోనపట్టణం కాకపోవచ్చు ... అంతగా అభివృద్ధి చెంది ఉండక పోవచ్చు. కాని క్షేత్ర పరంగా చెప్పుకోవాలంటే పురాణాల నుంచి నేటి వరకూ ఎంతో చరిత్ర వుంది. వైకుంఠంలో స్వామివారు ఎలా కొలువుదీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయో, అదే విధంగా స్వామివారు ఇక్కడ ఆదిశేషునిపై శయన ముద్రలో కొలువై ఉంటాడు. ఏడేడు భువనాలను పవిత్రం చేసే స్వామి పాదాల చెంత శ్రీదేవి - భూదేవి కనిపిస్తారు.
అలసిన వేళలోను అనుగ్రహించేవాడే కదా దేవుడు. అందుకే ఆయన తన భక్తులకు అందుబాటులో వుండటం కోసం ఆలూరు కోనపైకి దిగి వచ్చాడు. అందుకే స్వామిని 'కోన రంగనాథుడు' అని పిలుస్తూ వుంటారు. తాడిపత్రికి సమీపంలో గల ఈ అందాల కోనలో స్వామివారిని 'విశ్వామిత్ర మహర్షి' ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది.
విశాలమైన ఆలయ ప్రాంగణం ... ఎత్తయిన గోపురాలు ... పకడ్బందీగా కనిపించే ప్రాకారాలు ఆనాటి ఆలయ వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి. విజయనగర స్థాపకుడైన బుక్కరాయలు క్రీ.శ.13 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకు సంబంధించిన ఆధారాలు వున్నాయి. ఇక ఇక్కడి కోనేరు ఎంతో మహిమాన్వితమైనదని అంటారు. ఇందులో ఒకసారి స్నానం చేయడం వలన ఒక జన్మ పాపం నశిస్తుందని భక్తులు విశ్వ సిస్తుంటారు. ప్రతి ఏడాది 'చైత్ర పౌర్ణమి'నాడు స్వామివారికి కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగే రథోత్సవం కన్నుల పండువగా వుంటుంది.