మహాశివరాత్రి పూజా ఫలం

శివరాత్రి రోజున ఉపవాసం .. జాగరణ .. శివపూజ ప్రధానమైనవని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్షను చేపట్టి .. బిల్వ పత్రాలతో పూజించి .. జాగరణ చేస్తారో, అలాంటివారికి నరక బాధలు లేకుండా శంకరుడు రక్షిస్తాడు .. మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎన్నో పూజలు .. వ్రతాలు .. దానాలు .. తీర్థయాత్రలు చేస్తే లభించే పుణ్యం, శివరాత్రి రోజున చేసే శివారాధన వలన కలుగుతుంది.

ఈ రోజున శైవ క్షేత్రాలను దర్శించడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. దగ్గరలోని శివాలయాలను .. పంచారామ క్షేత్రాలను .. వీలైతే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏ ఒక్కటిని దర్శించినా ముక్తి లభిస్తుంది. శివరాత్రి రోజున 14 లోకాలలోని పుణ్య తీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువలన ఒక్క బిళ్వ దళమైనా శివార్పణ చేసి తరించాలని శాస్త్రం చెబుతోంది. శివరాత్రి రోజున ఉపవాస దీక్షను చేపట్టి, అంకితభావంతో శివయ్యను ఆరాధిస్తే, ఒక ఏడాదిపాటు అను నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మదేవుడితో చెప్పారనేది మహర్షుల మాట.


More Bhakti News