శివరాత్రి రోజున స్పటిక శివలింగ అభిషేక ఫలితం

మహా శివరాత్రి రోజున వివిధ రకాల శివలింగాలకు అభిషేకం చేస్తుంటారు. ఒక్కో రకం శివలింగానికి చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా శివరాత్రి రోజున స్పటిక శివలింగానికి పూజ చేయడం వలన, విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మహా శివరాత్రి రోజున స్పటిక శివలింగానికి పూజాభిషేకాలు జరపడం వలన, ధన ధాన్య వృద్ధి కలుగుతుంది .. సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

స్పటిక శివలింగం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వలన, వ్యాధులు .. బాధలు ఆ ఇంట్లోని వాళ్ల దరిదాపులకు కూడా రావట. స్పటిక శివలింగం ఏ ఇంట్లో ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా ఆ ఇంట్లో వాళ్లకి దారిద్ర్య బాధలు ఎప్పటికీ వుండవట. స్పటిక శివ లింగాన్ని అనునిత్యం ఆరాధించడం వలన, సమస్త పాపాల నుంచి విముక్తిని పొందుతారనీ, శివ సాయుజ్యాన్ని పొందుతారనేది మహర్షుల మాట.


More Bhakti News