వశిష్ఠ ఆలయం
అరుంధతి మహా పతివ్రత ... కాలాన్ని సైతం శాసించగల పాతివ్రత్యం ఆమె సొంతం. ఇక సప్త ఋషులలో అగ్ర పీఠాన్ని అందుకున్న శ్రేష్టుడు వశిష్ఠుడు. ఆదర్శవంతమైన ... అన్యోన్య కరమైన దాంపత్యానికి వారు ప్రతీక. అలాంటి దివ్య దంపతులకు మన దేశంలో ఒకే ఒకచోట దేవాలయం నిర్మితమైవుంది. విశిష్టమైన ఆ ఆలయం నిర్మితమై ఉన్న పవిత్రమైన ప్రదేశమే 'అంతర్వేది'. ఈ క్షేత్రంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి గురించి అందరికీ తెలుసు. అయితే ఈ క్షేత్రంలో ఆ స్వామి కొలువుదీరడానికి కారకులు వశిష్ఠ మహర్షి.
గౌతమ మహర్షి తన తపోశక్తితో తీసుకు వచ్చిన గౌతమిని సప్త ఋషులు ఏడు పాయలుచేసి వాటిని వేరు వేరు ప్రదేశాల్లో సముద్రంలో కలిసేలా చేశారు. ఇక్కడి పాయకు 'వశిష్ట గోదావరి' అనే పేరు వుంది. ఈ ప్రాంతంలోనే ఆయన అరుంధతితో కలిసి తన వందమంది సంతానంతో యజ్ఞయాగాదులు కొనసాగించాడు. సూర్య భగవానుడి వరప్రసాదంతో జన్మించిన అరుంధతికి ... వశిష్ఠ మహర్షికి వివాహం జరిగినప్పుడు దేవాధి దేవతలంతా విచ్చేసి, సమస్త మానవాళికి ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని గడపమని ఆశీర్వదించారట. అలాంటి జీవితాన్నే కొనసాగించిన ఈ దంపతులకు ఇక్కడ అష్ట భుజాకారంలో శ్రీ చక్రానికి సంకేతంగా దేవాలయం నిర్మించబడింది.
నూతన వధూవరులు ఈ క్షేత్రానికి వచ్చి అరుంధతీ ... వశిష్ఠ మహర్షిల దేవాలయాన్ని దర్శించుకుంటే, వారి కాపురం అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ అరుంధతీ ... వశిష్ఠ మహర్షుల విగ్రహాలు మాత్రమే కాకుండా, సప్త ఋషులలో మిగతావారైన అత్రి ... కశ్యప ... విశ్వామిత్ర ... భరద్వాజ ... గౌతమ ... జమదగ్ని మహర్షుల విగ్రహాలు కూడా కొలువుదీరి కనిపిస్తాయి. ఈ సాలగ్రామ శిలా రూపాలు చూడగానే మహా తేజస్సుతో వెలిగిపోతూ, భక్తి భావ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే మనసు నిర్మలమవుతుంది ... జన్మ పునీతమవుతుంది.