దైవానికి నైవేద్యంగా జంట అరటిపండ్లు

భగవంతుడి సన్నిధి అయిన ఆలయానికి వెళుతూ ఉత్త చేతులతో వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు. అందువల్లనే ఆలయానికి వెళుతూ పూలు - పండ్లు తీసుకెళుతుంటారు. అలా అరటిపండ్లు కొన్నప్పుడు ఒక్కోసారి జంట అరటి పండ్లు (అతుక్కుని వున్నవి) వస్తుంటాయి. వాటిని దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదనీ .. ఎవరికీ ఇవ్వకూడదని కొంతమంది అంటూ వుంటారు. ఎందుకొచ్చిన సందేహం అనేసి కొంతమంది వాటిని పారేస్తుంటారు.

అయితే అతుక్కుని వున్న అరటి పండ్లు చూడటానికి కాస్త తేడాగా అనిపిస్తాయి గనుక, వాటిని నైవేద్యంగా ఇవ్వకూడదనే ప్రచారం జరిగి ఉంటుంది. దైవానికి సాధ్యమైనంత వరకూ తాజా పండ్లనే నైవేద్యంగా సమర్పించాలి. తప్పనిసరి అయితే జంట అరటి పండ్లను కూడా ఇవ్వొచ్చనేది ఆధ్యాత్మిక వేత్తల మాట. అతుక్కుని వున్న అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించడం వలన, వాటిని ఇతరులకి ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని వారు సెలవిస్తున్నారు.  


More Bhakti News